close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

మన్యం విద్యకు ‘పునాది’ పటిష్ఠం

ప్రాథమిక స్థాయిలో సామర్థ్యాల సాధన

తొలి విడత పరీక్ష షురూ..

భద్రాచలం, న్యూస్‌టుడే

న్యంలోని గిరిజన విద్యాలయాల్లో చేరిన చిన్నారుల చదువు నాణ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పునాది-2ను అమలు చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ గతంలోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టి సత్ఫలితాలను సాధించినప్పటికీ చాలాకాలం నుంచి ఆగిపోయింది. ఈ విద్యా సంవత్సరంలో దానికి కొనసాగింపు చర్యలు చేపట్టారు. గత నెల 7న విద్యార్థుల సామర్థ్యాల(బేసిక్‌ టెస్ట్‌) పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత రోజు నుంచి పునాది-2 పాటిస్తున్నారు. ఇలా రెండు నెలలు ప్రాథమిక స్థాయిలో సామర్థ్యాల సాధన చేయనున్నారు. ప్రతీరోజు ఉదయం ఆయా తరగతులకు సంబంధించిన పాఠాలను బోధిస్తారు. మధ్యాహ్నం మూడు పీరియడ్లను దీనికి కేటాయించారు. తెలుగు, గణితం, ఇంగ్లిష్‌ సబ్జెక్టులను సులభంగా బోధించేందుకు అవసరమైన పుస్తకాలను ఇప్పటికే పంపించారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలతోపాటు అభ్యాస దీపిక(వర్క్‌ బుక్‌)లను ఇచ్చారు. ఈ తరహా బోధన వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసేలా అంశాలను తయారు చేశారు. గత వేసవిలో నిపుణులు చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రతీ 20 రోజులకు పరీక్ష: గత నెల 7న పరీక్ష రాసిన విద్యార్థుల అవగాహన శక్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు గురువారం తొలి పరీక్ష నిర్వహించారు. ఇక నుంచి ప్రతీ 20 రోజులకు ఒకసారి పరీక్ష ఉంటుంది. బోధన పూర్తయ్యే సరికి మొత్తంగా మూడు పరీక్షలుంటాయి. రాసిన పత్రాలను ఉపాధ్యాయులు దిద్దే సమయంలో పూర్తి పారదర్శకత పాటించనున్నారు. రెండేళ్ల క్రితం ఇదే పద్ధతిలో వరుసగా 100 రోజులు పరీక్షలు నిర్వహించినప్పుడు పదో తరగతిలో ఘోరమైన ఫలితాలు వచ్చాయి. దీనికి కారణం పారదర్శకత లేకపోవడమే. అప్పటి అనుభవాలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రతీ సబ్జెక్టులో చిన్నారులు చూపించిన ప్రతిభను కచ్చితంగా తేల్చాలని ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ పరీక్ష పోటీతత్వాన్ని పెంచడంతోపాటు ఆసక్తి కలిగించేలా ఉండనుంది.

ఆలోచించాల్సిన విషయమే...

మన్యంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో చాలామందికి చదవడం, రాయడం సరిగ్గా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కళాశాల చదువులకు దూరమై డ్రాపవుట్లుగా మిగులుతున్నారు. 7, 8, 9 తరగతుల విద్యార్థులు న్యూనతాభావంతో మధ్యలోనే బడి మానేస్తున్నారు. దీని నుంచి బయట పడడానికి గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక స్థాయి విద్యార్థుల పునాదిని పటిష్ఠ పర్చేందుకు కార్యాచరణ చేపట్టింది. వయస్సుకు, తరగతికి తగ్గ సామర్థ్యాలు లేకుంటే బడి మానేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నందున బోధనపై దృష్టి సారించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.