close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

ఇంకుడు గుంతలతో ఆరోగ్యకర గ్రామాలు

ఇంటింటా నిర్మాణాలు చేపడతాం
‘న్యూస్‌టుడే’తో గ్రామీణ ఎంపీడీవో రాజేశ్వరి
జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే

జగిత్యాల గ్రామీణ మండలంలో ప్రతి ఇంటికీఇంకుడు గుంత నిర్మాణం చేపట్టడమే కాకుండా మరుగుదొడ్ల వినియోగం, మొక్కల సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జగిత్యాల గ్రామీణ ఎంపీడీవో రాజేశ్వరి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్‌ గ్రామాన్ని ఆదర్శం తీసుకుంటే గ్రామాల రూపు రేఖలే మారతాయని ఆమె తెలిపారు. ఉద్యమంలా ఇంకుడు గుంతల నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆమె శుక్రవారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

ఉద్యమంలా ఇంకుడు గుంతల నిర్మాణం
జగిత్యాల గ్రామీణ మండలంలో మొత్తం 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉపాధిహామీ పథకంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మండలంలో 13,448 నివాసాలు ఉండగా అంతే మొత్తంలో మరుగుదొడ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 600 ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయగా, 620 నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతా కూడా నిర్మాణాలు చేపట్టేందుకు ఉపాధిహామీ సిబ్బంది ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

ఇంకుడు గుంతతో ఉపయోగం..
ఇంకుడు గుంతలతో చాల ఉపయోగం ఉంది. వృథా నీరు భూమిలోకి ఇంకుతుంది. ఫలితంగా  భూగర్భ జలాలు పెరుగుతాయి. మురుగు ఉండదు. దోమలు ఉండవు. ఇంకుడు గుంతల నిర్మాణం చేపడితే దోమల సమస్య ఉండదు. సిద్ధిపేట జిల్లా ఇబ్రహీంపూర్‌లో ఒక దోమ అనేది కనిపించదు. మన దగ్గర కూడా అలా చేయాలన్నదే నా లక్ష్యం.

ఉద్యమంలా ప్లాస్టిక్‌ సేకరణ
30 రోజుల ప్రణాళికలో చాలా సమస్యలు తొలగిపోయాయి. చెత్తను తొలగించారు. గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. పెనుభూతంలా తయారైన ప్లాస్టిక్‌ను నిషేధిస్తే పర్యావరణ పరిరక్షణ కలుగుతుంది. అందుకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ ఆదేశాల మేరకు గ్రామానికి 50 కిలోల బియ్యం అందించాం. ఇప్పటి వరకు మండలంలో అన్ని గ్రామాల్లో ప్లాస్టిక్‌ సేకరణ జరుగుతోంది. ముఖ్యంగా ప్లాస్టిక్‌ వినయోగం తగ్గించేలా అవగాహన కల్పిస్తున్నాం.

85 శాతం మొక్కలు బతికేలా చర్యలు
30 రోజుల ప్రణాళికలో అన్ని గ్రామాల్లో మొక్కలు నాటాం. రహదారి వెంట ఇరువైపులా మొక్కలు బాగా పెరుగుతున్నాయి. 85 శాతం బతికేలా చర్యలు తీసుకునేందుకు వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేయటంతో పాటు నీళ్లను పట్టిస్తున్నాం. ఇప్పటి వరకు 100 శాతం మొక్కలు బతికి ఉన్నాయి. ఎండాకాలం కొన్ని చనిపోయినా 85 శాతం మొక్కలు బతుకుతాయని ఆశాభావంతో ఉన్నాం.

ట్రాక్టర్లలో నిత్యం చెత్త సేకరణ
మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో ట్రాక్టర్లను అందిస్తున్నాం. ఇప్పటి వరకు 23 ట్రాక్టర్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. ట్రాక్టర్ల ద్వారా రోజూ చెత్త సేకరణతో పాటు, మొక్కలకు నీళ్లు పట్టించటం, ఇతర గ్రామ అవసరాలకు ఉపయోంచేందుకు ట్రాక్టర్‌ ఎంతో ఉపయోగపడనుంది. 30 రోజుల ప్రణాళికలో చాల సమస్యలు తొలగిపోయాయి.  వచ్చే 6 నెలల్లో పూర్తి స్థాయిలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేస్తాం

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.