close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మేడారం

సాహో.. పోలీస్

నిందితుల ఎన్‌కౌంటర్‌తో ప్రశంసల వెల్లువ

డయల్‌ 100లో అభినందనలు

నలుదిశల సంబురాలు

సాధారణంగా అత్యవసర సమయాల్లో డయల్‌ 100కు ఫోన్‌ చేస్తారు. ‘దిశ’ నిందితులు హతమయ్యారనే సమాచారం అందుకొన్న వెంటనే చాలా మంది ఉప్పొంగిపోయారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 52 మంది 100కు ఫోన్‌ చేసి పోలీసులకు అభినందనలు తెలిపారు. ‘‘ పోలీసులు బాగా పని చేశారంటూ.. కితాబిచ్చారు. ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మహిళలు, యువత, విద్యార్థులు సంబరాలు జరిపారు. ‘సాహో.. తెలంగాణ పోలీస్‌’ అంటూ అభినందనల వెల్లువ కొనసాగుతోంది.

- న్యూస్‌టుడే, ఇందూరు సిటీ

 

నిజామాబాద్‌: తిలక్‌గార్డెన్‌ నుంచి ఎన్‌టీఆర్‌ చౌరస్తా వరకు విద్యార్థుల ప్రదర్శన

శంషాబాద్‌ శివారులో దిశ మృతికి పాల్పడిన నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంపై ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. ప్రదర్శనలు చేపట్టారు. విద్యార్థినులు, మహిళలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మిఠాయిలు పంచుకున్నారు. టపాసులు కాల్చారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. మహిళలను వేధించే మానవ మృగాళ్లకు ఈ ఘటన కనువిప్పు కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

- న్యూస్‌టుడే, బృందం

మాచారెడ్డి మండలం కొత్తపల్లిలో బోర్డుపై నిందితుల చిత్రాలను గీస్తున్న విద్యార్థి అర్జిత్‌

నిజామాబాద్‌: ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో మిఠాయిలు తినిపించుకుంటూ...

కామారెడ్డిలో బాణాసంచా కాలుస్తూ సంబురాలు చేసుకుంటున్న భాజపా నాయకులు

పిట్లంలో పోలీసులకు పూలు ఇచ్చి అభినందనలు తెలుపుతున్న విద్యార్థినులు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.