close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

అండగా నిలిచారు.. అన్యాయంపై గొంతెత్తారు

దిశ గమనం

దిశ కుటుంబానికి మద్దతుగా నిలిచిన నక్షత్ర కాలనీవాసులు
నిందితుల ఎన్‌కౌంటర్‌తో బాణసంచా కాల్చి హర్షాతిరేకాలు
నిన్నటివరకు ఆ కాలనీలో విషాదం..
ఎటుచూసినా గంభీరమైన వాతావరణం..
వేదనభరితమైన హృదయాలతో..    చెమ్మగిల్లిన కళ్లతో..
దశ‘దిశ’లా గుండెలవిసేలా రోదనలు.. నిందితులను శిక్షించాలని ర్యాలీలు.. నిరసనలు..
నిత్యం పరామర్శలు.. సంతాపాలు.. ఇలా ఒకటే హడావుడి..
శుక్రవారం ఉదయం నుంచి..
ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు..
చెమ్మగిల్లిన కళ్లలో ఆనందభాష్పాలు.. బాణసంచా చప్పుళ్లు..
నోటిని తియ్యగా చేసిన మిఠాయిలు..
ఆవేదనతో నిండిన మాటల్లో ఆనందవీచికలు..
‘దిశ’లన్నీ ఆందోళనతో నిండగా.. కొంతమేర ఉపశమన పవనాలు..
శంషాబాద్‌ నక్షత్ర గేటెడ్‌ కమ్యూనిటీలో పరిస్థితులు మారిపోయాయి...

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, శంషాబాద్‌ గ్రామీణం

ఆహ్లాదకరంగా.. ఆనందంగా సాగిపోతున్న నక్షత్ర గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీ ప్రజల్లో అనుకోని ఘటన ఆవేదన నింపింది.. ఓ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. ఓ యువతిని బలిగొన్న దారుణ హేయమైన చర్యపై గొంతెత్తి పోరాడుతూ కాలనీ సభ్యులందరూ కదంతొక్కారు. ‘దిశ’లన్నీ వినిపించేలా.. దశ చూపేలా.. కాలనీలోని అపార్టుమెంట్లలో ఉంటున్న 156 కుటుంబాలు.. 126 విల్లాల్లో ఉంటున్న కుటుంబాలు సంఘటితమయ్యాయి. బంధుత్వం, రక్తసంబంధం లేకపోయినా తోటి వారికి జరిగిన అన్యాయంపై విషణ్ణవదనాలతో కదిలి.. న్యాయం కోసం నిలబడ్డారు. దిశ కుటుంబంలోని బాధను తమలోని ప్రతి ఒక్కరిదిగా భావించి ముందుకు కదిలారు.

కాలనీ ముఖద్వారం వద్ద ఫ్లెక్సీలు
గత నెల 27న రాత్రి దిశపై హత్యాచారం జరిగిందని.. 28న ఉదయం విషయం తెలిసినప్పట్నుంచి కాలనీవాసులు తీవ్ర విచారంలో మునిగిపోయారు.  దిశ కుటుంబానికి మద్దతుగా నిలబడి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా మహిళలు ముందుండి నడిచారు. ఘటన జరిగినప్పట్నుంచి కాలనీలోని ప్రజలందరూ కలిసి కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. తొలిరోజున జాతీయ రహదారిపై నుంచి పోలీసుస్టేషన్‌ వరకు ర్యాలీ సాగింది.

బాణసంచా.. మిఠాయిలు..
నిందితులను పోలీసులు కాల్చివేశారన్న వార్త తెలియడంతో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఎనిమిది రోజులుగా దుఃఖంలో ఉన్న తమకు నిజమైన పండుగ ఈ రోజే వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. మహిళలు, యువతులు బాణసంచా కాల్చారు. మిఠాయిలు తినిపించుకుని ‘దిశకు న్యాయం జరిగింది’ అని ఆలింగనం చేసుకున్నారు. దిశ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి దిశ ఆత్మశాంతికి నినదించారు.

పరామర్శలు.. సంతాపాలు..
ఘటన జరిగినప్పట్నుంచి రాజకీయ తదితర రంగాల ప్రముఖులు కాలనీకి వచ్చి దిశ కుటుంబాన్ని పరామర్శించారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సంజీవ్‌కుమార్‌, గవర్నర్‌ తమిళిసై, రాష్ట్ర మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, సత్యవతిరాఠోడ్‌, ఎంపీలు రేవంత్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, డీకే అరుణ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు శ్యామల, సినీ నటులు మంచు మనోజ్‌, రాజశేఖర్‌, జీవిత, అలీ, రామ్‌లక్ష్మణ్‌, మా అసోసియేషన్‌ సభ్యులు పరామర్శించి మద్దతు తెలిపారు.


దిశ కుటుంబంలో బాధని, వారికి కలిగిన లోటుని ఏదీ తీర్చలేదు. కానీ ఈ చర్య కొంచెం ధైర్యాన్నిస్తుంది. సరైన న్యాయమే జరిగింది. దిశ ఆత్మకు శాంతి కలగాలి. హైదరాబాద్‌ నగర పోలీసులకు సెల్యూట్‌.
- నటుడు నందమూరి కళ్యాణ్‌రామ్‌


మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.