close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

రాష్ట్ర వార్తలు

ఉల్లి కోసం..

● గంటల తరబడి వరుసల్లో నిరీక్షణ

● రైతుబజార్లలో 25 టన్నుల పంపిణీ

ఏలూరులో ఉల్లి కోసం బారులు తీరిన జనం

ఉల్లి ధర తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ధర నాణ్యతను బట్టి రూ.120 నుంచి రూ.160 వరకు పలుకుతోంది. ఈ క్రమంలో సామాన్యులకు ఊరట కల్పించేలా రాయితీపై ఉల్లి విక్రయాలను ప్రభుత్వం ప్రారంభించింది. మార్కెటింగ్‌ శాఖ ద్వారా కిలో రూ.25 చొప్పున రైతుబజార్లలో విక్రయిస్తున్నారు. ఆధార్‌, రేషన్‌ కార్డు ఆధారంగా ఒక వ్యక్తికి కిలో చొప్పున ఇస్తున్నారు. వీటికోసం జనం వెల్లువెత్తుతున్నారు. రైతు బజార్ల వద్ద గంటల తరబడి వరుసల్లో నిరీక్షిస్తున్నారు.

నరసాపురం, ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లాలోని ఆరుచోట్ల రైతుబజార్ల ద్వారా శనివారం 25 టన్నుల ఉల్లిపాయలను పంపిణీ చేశారు. రైతుబజార్ల వద్ద ప్రజలు ఉదయం నుంచే బారులు తీరారు. మహిళలు, పురుషులతో పాటు వృద్ధులు కూడా గంటల తరబడి వరుసల్లో నిల్చొని నిరీక్షించారు. రైతు బజార్లకు వస్తున్న సరకు ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదు. వినియోగదారులు భారీగా తరలిరావడంతో నరసాపురం రైతుబజారు ఆవరణ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. నరసాపురం, మొగల్తూరు మండలాలతో పాటు పక్కనే ఉన్న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి తదితర ప్రాంతాల నుంచి మహిళలు తరలి వచ్చారు. ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 3,500 కిలోల ఉల్లిపాయలను రాయితీపై విక్రయించారు. సరకు అయిపోయాక అప్పటికే వరుసలో ఉన్న వారంతా నిరాశగా వెనుదిరిగారు. ఏలూరు, భీమవరం రైతుబజార్లలో జనం పెద్దఎత్తున బారులు తీరారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.