close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

సినిమా

కన్నీళ్లల్లో.. ఆ ఇళ్లు..!

ఆ కుటుంబాల్లో చీకట్లు నిండి నేటికి సరిగ్గా నెల.. ఆ ఘోరకలి నుంచి ఇప్పటికీ ఆ కుటుంబాలు తేరుకోలేదు.. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి స్వగ్రామానికి తిరిగొస్తున్న వారి ప్రాణాలను కంటైనర్‌ రూపంలో మృత్యువు కబళించింది.. ఇంటి పెద్దదిక్కును కోల్పోయి ఏ ఆదరవూ లేక తల్లడిల్లుతున్న వారు కొందరైతే.. మాతృమూర్తులను కోల్పోయి కొందరు.. భార్యను కోల్పోయి ఒంటరిగా బిడ్డల బాధ్యతలు మోస్తున్న వారు మరి కొందరు.. ఇలా మొగిలిఘాట్‌ ప్రమాదంలో మృతి చెందిన గంగవరం మండలం మర్రిమాకులపల్లెలోని వారి కుటుంబ సభ్యులను పలకరిస్తే కన్నీళ్లలో మాటల ప్రవాహం సాగుతోంది.. వారికి అండగా నిలుస్తామని అధికారులు ప్రకటించారు.. రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు..కానీ వారి వేదనను పట్టించుకున్న దాఖలాలు లేవు.. మూడు వారాల క్రితం మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌, బ్యాంకు పాస్‌బుక్‌, రేషన్‌కార్డు జిరాక్స్‌ తీసుకున్న అధికారులు తక్షణ సాయంగా రూ. 50 వేలు ఇచ్చారు. మిగతా రూ.4.5 లక్షల పరిహారం గురించి ఇప్పటికీ తేల్చడం లేదు.. ఆ డబ్బులేదో ఇస్తే.. బిడ్డల బడి ఫీజులు కట్టుకుంటామని కొందరు.. ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.