close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

సినిమా

పక్షులు జీవించేందుకు సహకరిద్దాం
తిరుపతిలో బర్డ్‌ ఫెస్టివల్‌
పక్షుల వాయిస్‌ రికార్డు చేస్తున్న దృశ్యం

జీవకోన(తిరుపతి), న్యూస్‌టుడే: ‘ప్రకృతి ఒడిలో మనిషితోపాటు ఇతర జీవరాశులు ఎన్నో జీవిస్తున్నాయి. అందులో వివిధ ప్రత్యేకతలు ఉన్న పలు రకాల పక్షులు సైతం మనుగడ సాగిస్తున్నాయి. మనిషి స్వార్థం కారణంగా అవి అంతరించిపోతున్నాయి. మిగిలిన వాటినైనా కాపాడుకుని, మనతోపాటు జీవించేలా సహకరిద్దాం’ అని తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఆర్‌.మణిగండన్‌ అన్నారు. తిరుపతి ఐజర్‌, సైన్స్‌ సెంటర్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం తొలిసారిగా తిరుపతి బర్డ్స్‌ ఫెస్టివల్‌-2019 నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐజర్‌ సహకారంతో మూడురోజుల పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పక్షి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, నేటితరం యువతరం చేతులు కలిపి పక్షుల సంరక్షణకు పాటుపడాలని సూచించారు. ఔత్సాహికులు ఎవరైనా సరే తాము కనిపెట్టిన పక్షుల చిత్రాలను అంతర్జాతీయంగా పంచుకునే అవకాశం ఉందని, ఇందుకోసం ఈ-బర్డ్‌ అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఔత్సాహికులు ఉదయాన్నే సైన్స్‌ సెంటర్‌కు చేరుకుని పక్షుల పరిశీలన, గుర్తింపు, ఫొటోల చిత్రీకరణ, పక్షుల వాయిస్‌ రికార్డింగ్‌ పోటీల్లో పాల్గొన్నారు. పక్షులపై నిర్వహించిన చిత్రలేఖనం, పేపర్‌తో పక్షుల తయారీ పోటీల్లో పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తిరుపతి వైల్డ్‌లైఫ్‌ డివిజన్‌ డీఎఫ్‌వో నాగార్జునరెడ్డి, బర్డ్‌ వాచింగ్‌ శాస్త్రవేత్తలు నిహారికా రాజ్‌పుట్‌, మిట్టల్‌గాలా, డాక్టర్‌ ఎస్‌.సుబ్రహ్మణ్య, డాక్టర్‌ యోగానందరావు, రాజాబండి, డాక్టర్‌ సురేష్‌జైన్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మేఘాలయ, అసోం రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యావరణ పరిశీలకులు, ఐజర్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.