close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

సినిమా

ఇసుక టోల్‌ఫ్రీ నంబరు 14500

అక్రమాలపై ఫిర్యాదు చేయండి:కలెక్టర్‌

చిత్తూరు (జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే : జిల్లాలో ఇసుక విక్రయాలపై ఎలాంటి ఫిర్యాదులున్నా టోల్‌ఫ్రీ నంబరు 14500కు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా పాలనాధికారి నారాయణ భరత్‌గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇసుక నిల్వ కేంద్రాల్లో ధరలను ప్రదర్శించామని అన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించి టి.సదుం నిల్వ కేంద్రంలో టన్ను ధర రూ.425గా నిర్ణయించినట్లు చెప్పారు. పీలేరు నియోజకవర్గంలో తాటిగుంటపల్లిలో రూ.525, వాల్మీకిపురంలో రూ.425, పుంగనూరు నియోజకవర్గం చెదళ్లలో రూ.375, చంద్రగిరి నియోజకవర్గం పెరుమాళ్లలో రూ.560, తిరుపతి సమీపంలో రూ.460, శ్రీకాళహస్తి వద్ద రూ.530, సత్యవేడు నియోజకవర్గం సురుటుపల్లిలో రూ.460, నగరి నియోజకవర్గం ఓజీ కుప్పం, ఏకాంబర కుప్పం, మెలపట్టులో రూ.390-420, జీడీనెల్లూరు నియోజకవర్గం నందనూరులో రూ.410, చిత్తూరు నియోజకవర్గం అనంతాపురం, అనగల్లులో రూ.450-460, పూతలపట్టు నియోజకవర్గం వావిల్‌తోటలో రూ.450, పలమనేరు నియోజకవర్గం శంకరాయలపేట, గంగవరంలో రూ.625, కుప్పం నియోజకవర్గం శంకరాలయపేటలో రూ.738గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.