close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

సినిమా

తప్పులులేని ఓటర్ల జాబితా

జిల్లాలో 173 పోలింగ్‌ కేంద్రాలు తగ్గాయి

మాట్లాడుతున్న జిల్లా సంయుక్త పాలనాధికారి మార్కండేయులు.
చిత్రంలో డీఆర్వో విజయచందర్‌ ఇతర అధికారులు

చిత్తూరు (జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే : జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా సంయుక్త పాలనాధికారి మార్కండేయులు కోరారు. పోలింగ్‌ కేంద్రాల క్రమబద్ధకరణ, ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ, ఎపిక్‌ నోషనల్‌ నంబరింగ్‌ అంశాలపై శనివారం జిల్లా సచివాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫొటో ఓటర్ల జాబితా 2020 తయారీలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 16న ప్రకటించనున్నట్లు చెప్పారు. ఆరోజు నుంచి కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, ఆక్షేపణల దరఖాస్తులను స్వీకరిస్తామని అన్నారు. 2020 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారంతా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని, అర్హులైన వారికి కొత్త ఓటర్లుగా నమోదు చేయించే కార్యక్రమంలో రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టామని, నిర్ణీత సంఖ్య కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలను పక్క పోలింగ్‌కేంద్రాల్లో కలుపుతామని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు 3,800 పోలింగ్‌కేంద్రాలు ఉండగా.. క్రమబద్ధీకరణ తరువాత ప్రస్తుతం 3,668 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. సమావేశంలో డీఆర్వో విజయచందర్‌, చిత్తూరు, తిరుపతి ఆర్డీవోలు రేణుక, కనకనరసారెడ్డి, జిల్లాపరిషత్తు సీఈవో కోదండరామిరెడ్డి, ఏవో గోపాలయ్య, ఏఈఆర్వోలు, తెదేపా, వైకాపా, భాజపా, సీపీఊ, కాంగ్రెస్‌ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.