close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

సినిమా

97 వేల మీటర్ల ప్రహరీ నిర్మాణం
వెంకట్రమణారెడ్డిని సన్మానిస్తున్న ఎంఈవో సిద్ధరామయ్య, ప్రధానోపాధ్యాయులు
రంగనాథరెడ్డి, సురేంద్రనాథరెడ్డి

పీలేరు ఆర్‌ఎస్‌ మెయిన్‌, న్యూస్‌టుడే: విద్యాశాఖలో అమలు చేస్తున్న మనబడి నాడు-నేడు కార్యక్రమంలో తొలివిడతలో జిల్లాలో 519 ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 97 వేల మీటర్ల ప్రహరీ నిర్మించనున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్‌ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ వెంకట్రమణారెడ్డి అన్నారు. పీలేరు మండల వనరుల కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లలతో మాట్లాడారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో తొమ్మిది రకాల పనులను తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో చేస్తామని, 15 నుంచి 30 శాతం నిధులు అడ్వాన్సుగా ఇస్తున్నట్లు చెప్పారు. తొలివిడతలో 1504 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, 699 పాఠశాలలకు ప్రహరీలున్నందున కొత్తగా 519 పాఠశాలలకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలకు అవసరాలకు ఈ నెల 20వతేదీ లోగా సర్వే చేసి నివేదిక పంపాలని ఎంఈవోలను ఆదేశించామని పేర్కొన్నారు. 40 మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి నిర్మిస్తామని, సమగ్రశిక్ష అధికారులు ఎంపిక చేసిన కంపెనీల సామగ్రిని మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. పనులు త్వరితగతిన జరిగేందుకు పంచాయతీరాజ్‌శాఖ, సమగ్రశిక్ష, ఏపీఐడీడబ్ల్యూసీలకు అప్పగించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల కమిటీలకు శిక్షణ ఇస్తామన్నారు. పనులన్నీ వచ్చే ఏడాది మార్చి చివరకు పూర్తి కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. విద్యాశాఖకు సంబంధించి పీలేరు నియోజకవర్గంలో 2019-20 సంవత్సరానికి 11 పనులు రూ.27 లక్షలు, 2017-18 ఏడాదికి రూ.1.42 కోట్లతో 27 పనులు మంజూరు కాగా 16 పనులు వివిధ దశలో జరుగుతున్నాయని వివరించారు. పనులను మళ్లీ సామాజిక తనిఖీ బృందం పరిశీలిస్తుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా వెంకట్రమణారెడ్డిని ఎంఈవో సిద్ధరామయ్య, ప్రధానోపాధ్యాయులు రంగనాథరెడ్డి, సురేంద్రనాథరెడ్డి, సీఆర్పీ మురళీధర్‌రాజు ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.