close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

రాష్ట్ర వార్తలు

శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి

శిక్షణ పొందుతున్న మహిళలు

వట్లూరు (పెదపాడు), న్యూస్‌టుడే: బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుందని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్‌ దిట్టకవి శ్రీనివాసాచార్యులు పేర్కొన్నారు. వట్లూరులోని డీటీటీసీలో బ్యూటీషియన్‌ కోర్సులో మహిళలు పొందుతున్న శిక్షణను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల 20 నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 34 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారన్నారు. ఈ నెల 20తో శిక్షణ ముగుస్తుందని తెలిపారు. అనంతరం వారికి ధ్రువపత్రంతోపాటు ఉపాధి పొందేందుకు, బ్యూటీ¨పార్లర్లను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన రుణాలను అందించేందుకు సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్‌ శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆసక్తి కలిగిన 8వ తరగతి, ఆ పైన చదివి, 35 సంవత్సరాల లోపు మహిళలు కుట్టు శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. శిక్షణ పొందేందుకు ఆసక్తి కలిగిన వారు 08812-253975, 99485 65256 నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు పొందవచ్చన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.