close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

పాఠశాలల్లో ప్రయోగాత్మక బోధన సాగాలి

వైజ్ఞానిక ప్రదర్శన ముగింపులో కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌

ప్రదర్శనను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌, డీఈవో ఉషారాణి..

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌), న్యూస్‌టుడే : పాఠశాలల్లో ప్రయోగాత్మక బోధన సాగాలని కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని మోడల్‌బేసిక్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా విద్య, వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం ఆయన పరిశీలించారు. ఈ ప్రదర్శనలతో విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ వెలుగులోకి రావడంతో పాటు నైపుణ్యాలు మెరుగుపడుతాయని అన్నారు. ఇలాంటి ప్రదర్శనలు పాఠశాల స్థాయిలో నిర్వహిస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. విద్యార్థులు అందరు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో డీఈవో ఉషారాణి మాట్లాడారు. విద్యార్థులకు ప్రయోగాత్మక బోధన చేస్తే ఎక్కువ విషయాలు గుర్తుండే అవకాశం ఉందని చెప్పారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.

మొదటి బహుమతి వచ్చిన పాఠశాలలు : దేవరకద్ర సాంఘిక సంక్షేమ గురుకులం, నవాబ్‌పేట మండలం లింగంపల్లి, ఎన్మన్‌గండ్ల, ఇప్పటూరు జడ్పీహెచ్‌ఎస్‌లు, జడ్చర్ల మండలం పెద్ద ఆదిరాల, వల్లూరు, బాదేపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లు, మిడ్జిల్‌ కేజీబీవీ, మహబూబ్‌నగర్‌లోని మోడల్‌బేసిక్‌, అపెక్స్‌ సెంట్రల్‌, చైతన్య ఉన్నత పాఠశాలలు, భూత్పూర్‌ జడ్పీ పాఠశాల వివిధ విభాగాల్లో బహుమతులు సాధించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.