close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

అటవీ అమరుల స్మృతికి మొక్క


స్వాములవారి లింగోటంలోని వన నర్సరీని పరిశీలించి అధికారులకు సూచనలు చేస్తున్న

ప్రియాంక వర్గీస్‌, చిత్రంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అటవీ అమరులకు హరితహారం రాష్ట్ర ప్రత్యేకాధికారిణి ప్రియాంక వర్గీస్‌ నివాళి అర్పించారు. వారి స్మృత్యర్థం చౌటుప్పల్‌లోని అటవీ అమరుల స్మృతివనంలో ఆమె యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌తో కలిసి మొక్క నాటారు. అడవులను, అటవీ భూములను, వన్యప్రాణులను కాపాడేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ప్రాణత్యాగం చేసిన 21 మంది అటవీశాఖ ఉద్యోగులకు నివాళి అర్పిస్తూ దేశంలో మొట్టమొదట ఏర్పాటు చేసిన ఈ స్మృతివనాన్ని ప్రియాంక వర్గీస్‌ సందర్శించారు. అటవీ అమరుల జ్ఞాపకార్థం ఈ వనంలో నాటిన 21 మొక్కలను పరిశీలించారు. ఈ వనంలో ప్రజలు తమ ఆత్మీయుల జ్ఞాపకార్థం మొక్కలు నాటేందుకు ప్రోత్సహిస్తున్నందుకు అభినందించారు. అంతకు ముందు ఎస్‌.లింగోటంలో ఉపాధి హామీ పథకంలో పెంచిన మొక్కల నర్సరీని, రాయిగిరి అటవీక్షేత్రంలోని నరసింహ, ఆంజనేయ వనాలను ఆమె సందర్శించారు. వరంగల్‌ రహదారి వెంట మొక్కల సంరక్షణపై శ్రద్ధ తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు సూచనలిచ్చారు. సందర్శనలో జిల్లా అటవీశాఖాధికారి డి.వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ గిరిధర్‌, అటవీశాఖ అధికారులు సర్వేశ్వర్‌, శ్రీనివాస్‌, వెంకట్రాములు, రమేశ్‌ పాల్గొన్నారు.

హరితహారం అమలులో నిర్లక్ష్యం తగదు

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: హరితహారం మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించకూడదని హరితహారం రాష్ట్ర ప్రత్యేకాధికారి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ తెలిపారు. స్వాములవారిలింగోటంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన వననర్సరీని శనివారం ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. నర్సరీ పెంపకంలో చేపట్టిన జాగ్రత్తలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.