close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

ప్రకృతిని పరిరక్షించుకుంటూ పరిశోధనలు చేయాలి

జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మంత్రి జగదీశ్‌రెడ్డి


మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, వేదికపై ఎంపీ లింగయ్యయాదవ్‌, కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి,

ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, చిన్నపరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ నరేందర్‌రెడ్డి, డీఈవో బిక్షపతి తదితరులు

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రకృతిని పరిరక్షించుకుంటూ మానవజాతి వికాసానికి దోహదపడేలా పరిశోధనలు చేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. స్థానిక వనరులను ఉపయోగించుకుని పరిశోధనలు చేపట్టాలని సూచించారు. శనివారం నల్గొండలోని డాన్‌బాస్కో పాఠశాలలో నిర్వహించిన 47వ జిల్లాస్థాయి జవహర్‌లాల్‌ నెహ్రూ సైన్స్‌, గణిత, పర్యావరణ వెజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవిష్కరణలకు చివరి అంటూ లేదని, నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో కొత్తవి ఆవిష్కృతం చేయాలన్నారు. సభాధ్యక్షుడు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పర్చుకుని దానిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. జడ్పీ ఛైర్మన్‌ బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉన్నత పాఠశాల స్థాయిలోనే కాకుండా ఇంటర్‌, డిగ్రీ స్థాయిల్లో కూడా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్‌ మాట్లాడుతూ పిల్లల్లో ఆలోచన సామర్థ్యాలు పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎమ్మెల్సీ అలుగుబెలి నర్సిరెడ్డి మాట్లాడుతూ సైన్స్‌, గణిత శాస్త్రాలోనే కాకుండా సాంఘిక, ఆర్థిక శాస్త్రాల్లోనూ వైజ్ఞానిక ప్రదర్శనలు పెట్టాలని సూచించారు. మరో ఎమ్మెల్సీ చిన్నపురెడ్డి మాట్లాడుతూ కొత్త విషయాలను తెలుసుకునేందుకు విద్యార్థులు ఉపాధ్యాయులను ప్రశ్నించాలని సూచించారు. కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు విజ్ఞాన ప్రదర్శన దోహదపడుతుందని చెప్పారు. డీఈవో బి.భిక్షపతి మాట్లాడుతూ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రదర్శనలో 494 ప్రాజెక్టులు ప్రదర్శించినట్లు జిల్లా సైన్స్‌ అధికారి వనం లక్ష్మిపతి తెలిపారు. డైట్‌ ప్రిన్సిపల్‌ కె.నర్సింహ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆర్గనైజర్‌ మాలె శరణ్యారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


అలరించిన సాంస్కృతిక ప్రదర్శన

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.