close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

గుంతలు పూడ్చండి.. మొక్కలు నాటండి

ఈనాడు, హైదరాబాద్‌: జోనల్‌ కమిషనర్లు తమ పరిధిలోని రహదారుల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ సూచించారు. డిసెంబర్‌ 10 నుంచి అప్పగించిన 709 కి.మీ రోడ్ల నిర్వహణను మాత్రమే ప్రైవేటు ఏజెన్సీలు చూస్తాయని పేర్కొన్నారు. ఏజెన్సీలు పనులు ప్రారంభించే వరకు అంతర్గత రోడ్లతోపాటు, ప్రధాన రహదారులపై ఏర్పడే గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చాలని ఆదేశించారు. రోడ్ల మధ్యలో మొక్కలు నాటాల చెప్పారు. హెచ్‌ఆర్‌డీసీఎల్‌(హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలోని రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా మరమ్మతులకు ఒకరోజు టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఆదేశాలు జారీ చేశారు.

సూచికలపై ఏజెన్సీ పేరు..
ప్రైవేటు రోడ్ల నిర్వహణ పనులు మొదలయ్యాక.. ఆయా రోడ్డు మార్గాలపై అన్ని రకాల సూచికలు, పకడ్బందీ నిర్వహణ ఉంటుందన్నారు. సూచికలపై ఏజెన్సీ పేరు ఉంటుందని జీహెచ్‌ఎంసీ తెలిపింది. సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌-1 జోన్లకు సంబంధించిన రోడ్ల నిర్వహణ పనులను ఏజెన్సీలకు అప్పగిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.