close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

పేదలకు కార్పొరేట్‌ విద్య

అందాలన్నదే లక్ష్యం : బీఎస్‌.రాములు

శామీర్‌పేట, న్యూస్‌టుడే: పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురుకులాలను ఏర్పాటు చేశారని రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బీఎస్‌.రాములు అన్నారు. శనివారం మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామంలోని జూబ్లీహిల్స్‌, నాంపల్లి-కూకట్‌పల్లి-తుర్కపల్లి మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన హైదరాబాద్‌ జిల్లాస్థాయి 2019-2020 సాహిత్య సాంస్కృతిక మహోత్సవ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజేతలకు జ్ఞాపికలు అందించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేజీ టూ పీజీ విద్యను అందించే లక్ష్యంతో గురుకులాలను ప్రారంభించారన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నౌకదళం క్రీడా పోటీల్లో తుర్కపల్లి గురుకుల పాఠశాల విద్యార్థి నవదీప్‌ ప్రతిభ చూపారని అభినందించారు. విద్యార్థుల చిత్రలేఖనం స్టాల్స్‌ను పరిశీలించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చూపిన విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. భోజనశాల, విద్యార్థుల వసతి గృహం, మరుగుదొడ్లను ఆయన పరిశీలించి సూచనలు, సలహాలు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పరిశీలకులు సత్యనారాయణరెడ్డి, ప్రిన్సిపల్‌ కే.మూరారీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.