close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

365 రోజులు ఉచితంగా త్యాగరాయ గానసభ హాళ్లు

కళా జనార్దనమూర్తి

కవాడిగూడ, న్యూస్‌టుడే: కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు త్యాగరాయ గానసభలోని నాలుగు ఏసీ హాళ్లను 365 రోజులు ఉచితంగా ఇస్తామని గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి ప్రకటించారు. శనివారం గానసభలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాసుబ్బారావు కళావేదిక, కళా లలిత కళావేదిక, కళా వెంకటకళా దీక్షితులు వేదిక, గుండవరపు హనుమంతరావు వేదికల ఇక మీదట ఉచితంగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. శాస్త్రీయ సంగీతం, సాహిత్యం, పుస్తకావిష్కరణలు, జానపద సంగీతం,  జానపద కళా ప్రదర్శనలు, సాహిత్య గోష్ఠులు లాంటి కార్యక్రమాలకు ఉచితమని వివరించారు. స్వర్ణోత్సవాలకు సమయాత్తం అవుతున్న తరుణంలో అంతరించిపోతున్న కళలను బతికించుకునేందుకు, కళాకారులను ప్రొత్సహించేందుకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. సినిమా పాటల కచేరీలకు ఇక మీదట హాళ్లు ఇవ్వమని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యం, వాద్యపరికరాల శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి గురువారం ఉచితంగా వైద్య శిబిరం ఉంటుందని తెలిపారు. గానసభ ప్రతినిధులు బండి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.