close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

చల్లటి వేళ..ఆనందాల హేల

ఆర్‌ఎఫ్‌సీలో ఈనెల 13న వింటర్‌ ఫెస్ట్‌ ప్రారంభం
వేడుకల్లో హద్దుల్లేని వినోదం
న్యూస్‌టుడే, రామోజీ ఫిల్మ్‌సిటీ

ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ(ఆర్‌ఎఫ్‌సీ) శీతాకాల సంబరాలకు సిద్ధమవుతోంది. ఈనెల 13వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు ఆర్‌ఎఫ్‌సీలో వింటర్‌ ఫెస్ట్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక వినోదాలు, క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. మధురానుభూతిని పంచేలా సరికొత్త కార్యక్రమాలు, మైమరపించే లైవ్‌ షోలు, జిగేల్‌మనిపించే వెలుగుల్లో సంతోషాలు పంచే ప్రకృతి అందాలు, ప్రపంచ చలనచిత్ర రంగాన్ని ఉర్రూతలూగించిన బాహుబలి సెట్టింగ్స్‌ వీక్షణ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను పంచనుంది.

కార్నివాల్‌ పరేడ్‌.. సాయంత్రం సంతోషాలు
ఆర్‌ఎఫ్‌సీలో సాయంత్రం వేళ ఆకట్టుకొనే అందాల మధ్య కొనసాగే కార్నివాల్‌ సందర్శకులకు కనులవిందు చేయనుంది. నృత్య బృందాలు, స్టిల్ట్‌ వాకర్స్‌, జుగ్లర్స్‌ తదితరులు పంచే వినోదం పర్యాటకులను ఓలలాడించనుంది. చలిలో వెచ్చని ఆనందాలను పంచేలా సాగే కార్నివాల్‌ పరేడ్‌, విద్యుద్దీపాలంకరణలోని గార్డెన్ల అందాలు వీక్షిస్తూ ఆనందలోకాల్లో విహరించే అవకాశం కల్పిస్తున్నారు. సంబరాలను ఆస్వాదించాలనుకొనే పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలలో అవకాశం కల్పిస్తున్నారు.

రామోజీ స్టూడియో టూర్‌
(ఉదయం 9 నుంచి రాత్రి 7.30 గంటల వరకు)
ఆర్‌ఎఫ్‌సీ అందాలను, వినోద కార్యక్రమాలను, సూటింగ్‌ ప్రాంతాలను, ప్రకృతి అందాలను తిలకించడంతో పాటు పక్షులు, సీతాకోక చిలుకల ఉద్యానం, స్పేస్‌షిప్‌ అనుభూతిని పొందుతూ.. మినీ వరల్డ్‌ టూర్‌, ఫిల్మీదునియా, సినిమా చిత్రీకరణలోని మ్యాజిక్‌ను చూసే యాక్షన్‌ థియేటర్‌, పలు రైడ్స్‌, స్టంట్‌షోలను చూసే అవకాశం కల్పిస్తారు. బాహుబలి సెట్ల సందర్శన, ప్రత్యక్ష వినోదం, కార్నివాల్‌ పరేడ్‌, సాయంత్రం వినోదాలలో మునిగితేలవచ్చు.

రామోజీ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌
(ఉదయం 9 నుంచి రాత్రి 7.30 గంటల వరకు)
దీని కింద బఫెట్‌ లంచ్‌తో ఏసీ కోచ్‌లో ఫిల్మ్‌సిటీ సందర్శన, కాంప్లిమెంటరీ రైడ్స్‌ను, వినోదం పంచే కార్యక్రమాలను, స్టంట్‌షోలు, స్పేస్‌ షిప్‌లో మర్చిపోలేని అనుభూతి, షూటింగ్‌ లొకేషన్లను, గార్డెన్లను, ఎకో జోన్‌, పక్షుల, సీతాకోక చిలుకల పార్కు, బోన్సాయ్‌ గార్డెన్‌, పిల్లలకు వినోద ఏర్పాట్లు, బోరసుర, స్పిన్‌ థ్రిల్లింగ్‌ వాక్‌, ఫిల్మీదునియా, యాక్షన్‌ థియేటర్‌, ఆనందడోలికల్లో తేలియాడేలా చేసే కార్నివాల్‌ పరేడ్‌ను తదితరాలను విద్యుద్దీపాల నడుమ చూడొచ్చు.

వింటర్‌ ఫెస్ట్‌- రామోజీ నూన్‌ ఫిస్టా..
(మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు)
దీని కింద ఆర్‌ఎఫ్‌సీలో వింటర్‌ ఫెస్ట్‌లో ఆనందాలను పొందాలనుకునే సందర్శకులకు అవకాశం కల్పిస్తారు. బఫెట్‌ లంచ్‌ లేదా డిన్నర్‌ను అందిస్తారు. ఏసీ వాహనంలో ఫిల్మ్‌సిటీని వీక్షించొచ్చు. వినోద ప్రదర్శనలలోకి ఫాస్ట్‌ ట్రాక్‌ అనుమతి, షూటింగ్‌ ప్రాంతాల సందర్శన, కాంప్లిమెంటరీ రైడ్స్‌, స్టంట్‌ షోలు, స్పేస్‌ యాత్ర, మినీ వరల్డ్‌ టూర్‌, ఫిల్మీదునియా, యాక్షన్‌ థియేటర్‌, పిల్లలకు వినోదాలు పంచేలా ఏర్పాట్లు, ఫండుస్థాన్‌, బోరసుర, బాహుబలి సెంట్ల వీక్షణ, గార్డెన్ల అందాల మధ్య విహరించొచ్చు.

కొత్త సంవత్సర వేడుక
కొంగొత్తగా..
నూతన సంవత్సరం వేడుకలను ఆస్వాదించాలనుకొనే వారి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సరికొత్త అనుభూతిని ఆస్వాదించేలా వేదికలు,  వీనుల విందైన సంగీతానికి తోడు గాలా నైట్‌లో విందును ఆస్వాదిస్తూ కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టే అద్వితీయ అవకాశం కల్పించనున్నారు.

విడిదికీ అవకాశం...
ఫిల్మ్‌సిటీలో శీతాకాల సంబరాలలో భాగంగా ప్రత్యేక విడిది ప్యాకేజీలను రూపొందించారు. కనీసం రెండు రోజులు స్థానిక హోటళ్లలో బసచేసి వేడుకలను ఆనందించే ప్యాకేజీలున్నాయి. ఆర్‌ఎఫ్‌సీలోని డాల్ఫిన్‌ హోటల్స్‌ ఆధ్వర్యంలో నడిచే లగ్జరీ హోటల్‌ సితార, కంఫర్ట్‌ హోటల్‌ తార, వసుంధర విల్లాలు, ఫాంహౌస్‌, సహారా, శాంతినికేతన్‌, గ్రీన్స్‌ఇన్‌లలో విడిదికి ప్యాకేజీలున్నాయి.

రామోజీ ట్విలైట్‌ ప్యాకేజీ
(మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 9 గంటల వరకు)
ఇది సాయంత్రం వేళ ప్యాకేజీ. సందర్శకులు కాంప్లిమెంటరీ రైడ్స్‌, వినోదం పంచే యురేకా వేదిక కార్యక్రమాలు, ఫండుస్థాన్‌, పిల్లలకు వినోదం పంచే బోరసుర, స్పిన్‌ థ్రిల్లింగ్‌ వాక్‌, మిరుమిట్లుగొలిపే ఆర్‌ఎఫ్‌సీ అందాల మధ్య విహారంతో ఆనంద తీరాలను చవిచూస్తూ.. కార్నివాల్‌ పరేడ్‌, సాయంత్రం వేళ వినోదాల జల్లుల్లో తేలియాడుతూ.. ప్రత్యేక రుచుల గాలా డిన్నర్‌ను ఆస్వాదించొచ్చు.

బస్‌ సర్వీస్‌లు..
ఫిల్మ్‌సిటీ వింటర్‌ ఫెస్ట్‌ సంబరాలలో పాల్గొనాలనుకొనే పర్యాటకులకు ఎల్బీనగర్‌, నాగోల్‌ మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా ఫిల్మ్‌సిటీకి చేరుకోవడానికి బస్సు సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి. వివరాలకు.. ఫోన్‌ నం: 96578 80088

మరిన్ని వివరాలకు..
* హైదరాబాద్‌: 95151 08472, 80080 35525
* కృష్ణా జిల్లా:  93944 89154
* టోల్‌ ఫ్రీ నంబరు : 1800 120 2999
*
www.ramojifilmcity.com లో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.