close

మంగళవారం, జనవరి 21, 2020

ప్రధానాంశాలు

అలరించిన జానపదం... ఆకట్టుకున్న శాస్త్రీయ నృత్యం

బాలోత్సవంలో అబ్బురపరచిన చిన్నారులు

చిట్టినగర్‌, న్యూస్‌టుడే: జానపద గేయాలకు చిన్నారులు చేసిన నృత్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. దేశ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే కూచిపూడి, భరతనాట్యం చేసి బాలోత్సవానికి వన్నె తెచ్చి అందరినీ అబ్బురపరిచారు. అమరావతి బాలోత్సవం పిల్లల పండగ పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండవ రోజు శనివారం కొనసాగింది. పిల్లలు వివిధ అంశాల్లో తమ నైపుణ్యతను, ప్రతిభను, విన్యాసాలను చాటుకున్నారు. ఈ ఉత్సవంలో జానపద నృత్యాలకు పెద్దపీట వేశారు. సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో చిన్నారులు నృత్యం చేసి శెభాష్‌ అనిపించుకున్నారు.  లఘు నాటికలు, మైము ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏకప్రాతాభినయాలతో అలరించారు.  కళలు నానాటికీ అంతరించి పోతున్న తరుణంలో బుర్ర కథ] అందరినీ ఆకట్టుకుంది. దేశభక్తి గీతాలతోపాటు సినీ పాటలతో నృత్యాలు చేసి అదరగొట్టారు.

విద్యతో పాటు ఆట, పాటలూ అవసరం... తాము విద్యను అభ్యసించే రోజుల్లో చదువుతో పాటు ఆట, పాట ఒక భాగంగా ఉండేవని, నేడు అవి కనిపించని పరిస్థితి ఉందని శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు అన్నారు.  సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కుటుంబంతో, తోటి విద్యార్థులతో, బయటి వ్యక్తులతో ఎలా ఉండాలో ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయని అన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి బాలమోహన్‌దాస్‌ మాట్లాడుతూ బాలోత్సవాలు తమకు ఎంతో నచ్చాయన్నారు. అనంతరం  విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం గౌరవ అధ్యక్షుడు మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావు, అధ్యక్షుడు ఎస్‌.పి.రామరాజు, ఉపాధ్యక్షులు నరసింహారావు, వల్లభరావు, సాంబశివరావు, కార్యదర్శులు మురళీకృష్ణ, జోత్స్న, రోటరీ క్లబ్‌ మిడ్‌టౌన్‌ అధ్యక్ష కార్యదర్శులు అనిల్‌కుమార్‌, వెంకట్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.