close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

మంచు కురిసే వేళ..

ముప్పు కనీస జాగ్రత్తలతో సాఫీ ప్రయాణం

ఈనాడు, హైదరాబాద్‌: నగరవాసుల్ని రెండు మూడు రోజులుగా చలి వణికిస్తోంది. ఉదయం పూట వాహనదారులను పొగమంచు భయపెడుతోంది. రహదారులపై దట్టమైన మంచుతో ముందున్న దారులేవీ కన్పించడం లేదు. అర్ధరాత్రి నుంచి ఉదయం ఏడున్నర వరకు ఇదే పరిస్థితి. గతేడాది చలికాలంలో జాతీయ రహదారిపై శంషాబాద్‌ దాటాక ఒకేసారి 16 వాహనాలు పొగ మంచుతో ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ప్రస్తుతం తెల్లవారుజామున అలుముకుంటున్న మంచుతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

నగరంలో శనివారం తెల్లవారుజామున కనిష్ఠ ఉష్ణోగ్రత 16.1 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువ. అయినా చలి వణికిస్తోంది. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు మంచు కురుస్తోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి నగరంపైకి గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమ గాలులతో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు మంచు కురుస్తోంది.

వాహనదారులూ అప్రమత్తం..
గతానుభవాలు చూస్తే బెంగళూరు, వికారాబాద్‌ రహదారుల ప్రాంతాల్లో మంచు ప్రభావం అధికంగా ఉంటోంది. ఇక్కడే గతంలో వాహనాలు ఢీకొన్నాయి. ఈ 2 నెలలు ఉదయం సొంత వాహనాల్లో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని ఆటోమొబైల్‌ నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.