close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

మేడారం

సమష్టి కృషి... సత్ఫలితాలు

ఇక వైద్యానికి భరోసా

సమన్వయంతోనే సమస్యకు పరిష్కారం●

ఆరోగ్య నేస్తం ఆధ్వర్యంలో కృషి

జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆరోగ్యనేస్తం సేవలు

సమష్టి కృషితో ముందడుగేశారు. సత్ఫలితాలను సాధిస్తున్నారు. సుదీర్ఘకాలంగా విధి నిర్వహణలో సేవలందించిన విశ్రాంత ఉద్యోగులు సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. రోగులకు, వైద్యులకు మధ్య సమన్వయం కుదురుస్తున్నారు. వైద్య సేవలపై భరోసా కల్పిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రి పరిధిలో ఆరోగ్య నేస్తం పేరిట చేస్తున్న కృషి రోగుల చేత ప్రశంసలందుకుంటోంది. జిల్లా పాలనాధికారి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే

జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోజుకు 700-800 ఓపీ వస్తోంది. వివిధ సమస్యలతో సతమతమయ్యే వారు ఆస్పత్రికి వచ్చి ఏ వైద్యుడిని సంప్రదించాలో తెలియక తికమకపడుతుంటారు. ఏ పరీక్ష ఎక్కడ చేస్తారో తెలియని పరిస్థితి. రద్దీ పెరగడంతో వైద్యులకు ఓపిక లేక హడావుడిగా వైద్య సేవలందిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఆరోగ్య నేస్తం ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 30 మందికి పైగా సభ్యులను చేర్చారు. వీరు నిత్యం జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చి రోగుల బాధలను తెలుసుకుంటారు. వీరికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేశారు. వివిధ సమస్యలతో వచ్చే రోగులకు చేయూతనిస్తున్నారు. నిత్యం ఓపీ రిజిస్టర్‌లో రోగుల పేర్లను నమోదు చేసుకుని ఏ విభాగానికి వెళ్లాలో తెలియజేస్తున్నారు.

వైద్యశాఖ విశ్రాంత ఉద్యోగులే ఎక్కువ

ఆస్పత్రిలో ఆరోగ్య నేస్తం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో వైద్యశాఖ విశ్రాంత ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు. 10 మందికి పైగా ఈ శాఖకు సంబంధించిన వారినే కమిటీలో భాగస్వాముల్ని చేశారు. వైద్య సంబంధిత సమస్యలపై ఎక్కువ అవగాహన ఉండటంతో రోగులకు సత్వరం సేవలందేలా కృషి చేస్తున్నారు. విశ్రాంత ఉప వైద్యాధికారి స్థాయి నుంచి వైద్యశాఖలో పని చేసిన ఉద్యోగుల పాత్రను కీలకంగా మార్చారు.

ఆరోగ్య నేస్తం కేంద్రం వద్ద రోగుల రద్దీ

పారిశుద్ధ్య నిర్వహణపై పర్యవేక్షణ

ఆస్పత్రి ఆవరణలో పరిసరాల పరిశుభ్రత కీలకం. పారిశుద్ధ్య నిర్వహణపై ఆరోగ్య నేస్తం ప్రతినిధులు పర్యవేక్షణ జరుపుతున్నారు. గతంలో వైద్య సేవల్లో వీరి జోక్యంపై వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా జిల్లా పాలనాధికారి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. వైద్యులకు, రోగులకు మధ్య సమన్వయం కుదురుస్తున్నారు.

సేవలకు ప్రశంసలు

ఆరోగ్య నేస్తం కమిటీ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలపై జిల్లా యంత్రాంగం ప్రశంసలందించింది. కమిటీ సభ్యులను జిల్లా పాలనాధికారి సత్యనారాయణ చేతుల మీదుగా సన్మానించారు. సేవలను మరింత మెరుగుపరిస్తే వైద్యపరంగా ఇంకా సత్ఫలితాలను ఆశించే వీలుందని జిల్లా అధికారులు పేర్కొన్నారు.

గణితశాస్త్ర ప్రతిభా పరీక్షలు

దోమకొండ, న్యూస్‌టుడే: దోమకొండలోని బాలుర పాఠశాలలో గణిత ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం పదో తరగతి విద్యార్థులకు మండల స్థాయి గణిత శాస్త్ర ప్రతిభా పరీక్షలు నిర్వహించారు. ఆంగ్ల మాధ్యమంలో అంజల్‌రెడ్డి (జడ్పీహెచ్‌ఎస్‌, అంబారిపేట) ప్రథమ , శివప్రసాద్‌ (జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర దోమకొండ) ద్వితీయ, గణేశ్‌ (జడ్పీహెచ్‌ఎస్‌, ముత్యంపేట) తృతీయ , తెలుగు మాధ్యమంలో సంగీత్‌ (జడ్పీహెచ్‌ఎస్‌, బాలికల దోమకొండ) ప్రథమ, నిఖిత (జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల దోమకొండ) ద్వితీయ, సోనాలి (జడ్పీహెచ్‌ఎస్‌ పలుగడ్డ, దోమకొండ) తృతీయ, ప్రనూష (జడ్పీహెచ్‌ఎస్‌ అంబారిపేట) నాలుగో స్థానం సాధించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రతినిధులు అభినందించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌, సంతోష్‌కుమార్‌, బాపురెడ్డి, అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపై అధ్యయనం

కృష్ణారెడ్డి, విశ్రాంత ఉద్యోగి

ఆరోగ్య నేస్తం కమిటీ ద్వారా ఏ రోగాలు ఎక్కువగా వస్తున్నాయో తెలుసుకోవడానికి అధ్యయనం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో సమస్యలను అధిగమించడానికి దోహదపడనుంది. నిత్యం నివేదికలను జిల్లా కేంద్ర ఆస్పత్రి పర్యవేక్షణాధికారికి అందజేస్తున్నాం.

అడ్లూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని పరిశీలిస్తున్న సీఈవో మోహన్‌రావు

రోగులకు చింత లేకుండా

శ్రీనివాస్‌, విశ్రాంత వైద్యశాఖ అధికారి

ఆస్పత్రికి ఏదో ఒక సమస్యతో బాధపడుతూ వస్తుంటారు. వీరు రాగానే ప్రేమతో మాట్లాడితే సగం రోగం నయమయినట్లే. ఈ విధమైన సేవలందించడానికి కమిటీ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. రోగులకు ప్రేమను పంచుతున్నాం. సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించేలా తోడ్పాటునందిస్తున్నాం.

ఇబ్బందులు లేకుండా

సాయాగౌడ్‌, విశ్రాంత ఉద్యోగి

ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందాలన్నదే నా అభిప్రాయం. వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. నిత్యం రోగుల వివరాలను సేకరిస్తున్నాం. ఎవరు ఏ వ్యాధితో సతమతమవుతున్నారో తెలుసుకుని వారిని వైద్యుల చెంతకు తీసుకెళ్తున్నాం.

సేవాభావం ముఖ్యం

యాదగిరి, విశ్రాంత ఉద్యోగి

ప్రతి మనిషిలో సేవాభావం ముఖ్యం. గత ఏడాదిన్నరగా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులకు సేవలందిస్తున్నాం. సేవల్లో లోపాలకు తావివ్వకుండా వైద్యులకు సహకరిస్తున్నాం. ఈ విషయంలో జిల్లా పాలనాధికారి తోడ్పాటు ఎనలేనిది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.