close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

ఐదు రోజులు @ రూ.50 లక్షలు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌

నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీకి పెంచిన ఛార్జీలు ఊపిరి పోశాయి. ప్రయాణికులపై భారం పడినా... సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకొని కిలోమీటరుకు రూ. 20 పైసల చొప్పున పెంచారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గతంలో నిత్యం రూ.70 లక్షల ఆదాయం సమకూరేది.. పెరిగిన ఛార్జీలతో రోజుకు రూ.13 లక్షలు అదనంగా వస్తోంది. ఐదు రోజుల్లో సుమారు రూ.50 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నాన్నారు. డీజిల్‌ ధర లీటరకు రూ.40 ఉన్న సమయంలో ఛార్జీలు పెంచారు. ప్రస్తుతం డీజిల్‌ ధర రూ. 71 చేరింది. నాటి నుంచి ఛార్జీలు పెంచక పోవడంతో సంస్థ నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా నెల రోజుల్లో ఉమ్మడి జిల్లాకు కొత్తగా 102 అద్దె బస్సులు రానున్నాయి. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లో 670 బస్సులున్నాయి.

ఒప్పంద కార్మికులకు మంచిరోజులు

ఉభయ జిల్లాల్లో 23 మంది రెగ్యులర్‌

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీలో కొన్నేళ్లుగా ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు మంచిరోజులు వచ్చాయి. తాత్కాలికంగా పని చేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉభయ జిల్లాల్లో మొత్తం 24 మంది ఒప్పంద పద్ధతిలో పని చేస్తున్నారు. వీరిలో 240 పనిదినాలు పనిచేసిన వారిని రెగ్యులర్‌ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కరికి మినహా 23 మందికి రెగ్యులర్‌ అయ్యే అవకాశం దక్కింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.