close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

మేడారం

కాసుల దస్త్రం

ఐదేళ్లలో ఆరు కేసులు

మారని అధికారుల తీరు

కొనసాగుతున్న అక్రమాల పర్వం

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ

ప్రతి కార్యాలయంలో దస్తావేజుకు ఓ ధర నిర్ధరించారు. ఉదాహరణకు ఒకదానికి రూ.1,500 వసూలు చేస్తే ఇందులో రూ.800 సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద అప్పగిస్తున్నారు. రూ.700 సబ్‌ రిజిస్ట్రార్‌ తీసుకొని మిగిలిన రూ.100 సిబ్బందికి ఇస్తారు. ఇలా రోజులో జరిగిన దస్తావేజులకు సంబంధించి అదేరోజున సాయంత్రం లెక్కలు వేస్తారు. తమ వద్ద నియమించుకొన్న ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ డబ్బులు తీసుకొంటున్నారు. ఒక్కో కార్యాలయంలో రోజుకి రూ.25వేలు-రూ.50వేలు అక్రమంగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

వారే కీలకం

 

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగే ప్రతి దస్తావేజు వెనుక దస్తావేజు లేఖరులు ఉంటున్నారు. వీరే దస్తావేజుల తయారీ నుంచి కార్యాలయాల్లోనికి వెళ్లి ప్రక్రియ పూర్తయ్యేలా చూస్తున్నారు. ఒక విధంగా స్లాట్లు తీసుకోకపోయినా అధికారులపై ఒత్తిడి పెంచి మరి పని కానిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో అవకాశం ఉన్నా..

* రిజిస్ట్రేషన్‌ తదితర సేవలను ఆన్‌లైన్‌లో వినియోగించుకొనే సదుపాయం ఉంది. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

* దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పైగా దస్తావేజు లేఖరులను ప్రోత్సహిస్తున్నారు. పలు కార్యాలయాల్లో దస్తావేజు లేఖరులు అన్నీ తామై చూసుకుంటున్నారు.

* సిబ్బందికి బదులు వీరే పనులు చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.

దాడులు జరిగితే గప్‌చుప్‌

అనిశా అధికారులు దాడులు జరిపిన సమయంలో అంతా గప్‌చుప్‌గా వ్యవహరిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే దస్తావేజు లేఖరులు దుకాణాలను మూసివేస్తున్నారు.

* నిజామాబాద్‌ రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ శుక్రవారం సాయంత్రం ఏసీబీకి చిక్కారు. కేవలం 10 నిమిషాల్లోనే దస్తావేజు లేఖరులందరు అక్కడి నుంచి ఉడాయించారు.

* ఈ కార్యాలయంలో శనివారం కూడా ఎలాంటి దస్తావేజులు జరగలేదు. అన్ని దుకాణాలు కూడా మూసి ఉన్నాయి.

వరస కేసులు

అనిశా దాడి కేసులు వరుసగా నమోదవుతున్నా అధికారుల తీరు మాత్రం మారట్లేదు. గడిచిన ఐదేళ్లలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు ఆకస్మిక తనిఖీల కేసులున్నాయి. మిగిలిన మూడు కేసుల్లో నేరుగా లంచం తీసుకొంటుండగా అధికారులు దొరికిపోయారు.

నేరుగా రావాలని సూచిస్తున్నాం

ప్రకాష్‌, జిల్లా ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌

ప్రజలు నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచిస్తున్నాం. ఎలాంటి డబ్బులు వసూలు చేయరాదని సబ్‌ రిజిస్ట్రార్లకు ఇదివరకు సూచించాను. ప్రతి కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ను కూడా తెరిచి ఉంచాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.