close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మేడారం

కార్మిక వర్గాలు సంఘటితంగా పోరాడాలి

ప్రారంభమైన సీఐటీయ 10వ జిల్లా మహాసభలు

మహాసభల్లో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా

ఖమ్మం మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే: కార్మిక వర్గాలన్నీ సంఘటితంగా పోరాడి వారి హక్కులను సాధించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబా పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా 10వ మహాసభలు ఖమ్మంలోని ఐఎంఏ హాల్లో ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలుత సీఐటీయూ పతాకాన్ని సీనియర్‌ నాయకుడు మచ్చా రంగయ్య ఆవిష్కరించారు. కార్యదర్శి నివేదికను సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు ప్రవేశపెట్టారు. అనంతరం నిర్వహించిన మహాసభల్లో సాయిబాబా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక భారాన్ని కార్మికులు, ప్రజలపై మోపుతూ పెట్టుబడిదారుల లాభాలకు పాలకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయంగా పెట్టుబడిదారీ సంక్షోభం వల్ల అన్ని దేశాల్లోనూ కార్మికవర్గంపై భారాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మితవాద శక్తులు అధికారంలోకి వస్తుంటే మరోవైపు అభ్యుదయ, వామపక్ష శక్తులు గణనీయమైన విజయాలు సాధిస్తున్నాయన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామిక, మానవహక్కులపై మోదీ ప్రబుత్వం మొదలుపెట్టిన దాడి మరింత తీవ్రంగా కొనసాగుతోందన్నారు. భాజపా ప్రభుత్వం నయా ఉదారవాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో దూకుడుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. 46 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు పేర్కొన్నారు. వెజ్‌కోడ్‌ వాహన చట్టం పేరుతో కార్పొరేట్‌ శక్తులకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ సరళీకరణ విధానాలనే తెరాస ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ ఆరేళ్ల పాలనలో ఉద్యోగులు, ప్రజలు, కర్షకులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. కార్మికుల హక్కుల సాధనలో సీఐటీయూ పోరాటాల్లో ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి రాములు, జిల్లా అధ్యక్షుడు నరసింహారావు, జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మా విష్ణువర్ధన్‌, జిల్లా ఉపాధ్యక్షులు యర్రా శ్రీకాంత్‌, సీహెచ్‌. విఠల్‌, తుశాకుల లింగయ్య, మోహన్‌రావు, నరసింహారావు, కోటేశ్వరి, సీహెచ్‌.కుమారి, తిరుమలాచారి, గడ్డం లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.