close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

మేడారం

అంతరాయం ఎప్పుడు?

చరవాణికి విద్యుత్తు సమాచారం

ఖమ్మం జిల్లాలో విద్యుత్తు కనెక్షన్లు 6,00,946

అనుసంధానించిన కనెక్షన్లు.. సుమారు 60%

ఖమ్మం రోటరీనగర్‌, న్యూస్‌టుడే

ఒకప్పుడు విద్యుత్తు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషితో ఇప్పుడు 24 గంటల నిరంతరాయ విద్యుత్తు సరఫరాకు శ్రీకారం చుట్టింది. అయినా మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనుల కారణంగా నిత్యం ఎక్కడో ఒకచోట విద్యుత్తు సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఆ సమాచారాన్నీ వినియోగదారుని చరవాణికి ముందస్తుగానే పంపేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌) శ్రీకారం చుట్టింది. అలాగే బిల్లులు, ఇతర సమాచారాన్ని సైతం చరవాణికి పంపుతున్నారు.

సమాచారం ఇలా...

విద్యుత్తు సరఫరాను ఉప కేంద్రం పరిధిలోని ఫీడర్ల వారీగా నియంత్రిస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టే పనుల కారణంగా ముందు రోజు దీనిపై నిర్ణయం తీసుకుంటారు. దానికి సంబంధించిన సమాచారాన్ని ఆయా ప్రాంతాల్లోని విద్యుత్తు మీటరుకు అనుసంధానం అయిన చరవాణికి సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్‌) అందుతుంది. ఏ సమయంలో ఎంతసేపు అంతరాయం కలుగుతుందో దీనిలో పొందుపరుస్తారు. ఈ సమాచారాన్ని ఆయా ఉపకేంద్రాల అధికారులు వెబ్‌సైట్‌లో నమోదు చేయడంతో ఆటోమేటిక్‌గా ఈ సందేశం వెలువడుతుంది. తద్వారా వినియోగదారుడు అప్రమత్తమయ్యే అవకాశం ఏర్పడుతుంది.

అనుసంధానం ఎలా?...

విద్యుత్తు కనెక్షను ఎవరి పేరున ఉందో వారు తమ చరవాణి సంఖ్యను అనుసంధానించుకోవాల్సి ఉంది. మీటరు రీడింగు తీసేందుకు వచ్చే వారికి తెలపడం ద్వారా, స్థానిక అధికారులను సంప్రదించడం ద్వారా దీనిని నమోదు చేసుకోవచ్ఛు వెబ్‌సైట్‌ ద్వారానూ ఆధార్‌, చరవాణి సంఖ్యలను సొంతంగా వినియోగదారులే నమోదు చేసుకోవచ్ఛు

ఎస్సీ, ఎస్టీలు...

పేద ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నెలలో 101 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగిస్తే వారికి పూర్తిగా ఉచితం. అందుకు కనెక్షను ఎవరి పేరున ఉంటే వారు కుల ధ్రువీకరణ పత్రాలను తమకు అందించి నమోదు చేయించుకోవాలి.

చరవాణి సంఖ్యను అనుసంధానించుకోవాలి

విద్యుత్తు కనెక్షనుకు చరవాణి సంఖ్యను అనుసంధానించుకోవాలి. దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా నిర్ణయించిన అంతరాయాలపై వెబ్‌సైట్‌లో నమోదు చేస్తాం. వెంటనే ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యుత్తు కనెక్షన్లకు అనుసంధానమైన చరవాణులకు సమాచారం వెళ్తుంది. అలాగే బిల్లుల సమాచారమూ అందుతుంది. ఇది ప్రస్తుతం నగరంలో అమలు చేస్తున్నాం. జిల్లా అంతటా త్వరలోనే అమలు చేస్తాం.

- ఎల్‌.రాములునాయక్‌, డీఈ, ఎన్‌పీడీసీఎల్‌, ఖమ్మం

మరెన్నో లాభాలు..

విద్యుత్తు కనెక్షనుకు చరవాణి సంఖ్యను అనుసంధానించడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. బిల్లు ఎంత వచ్చింది? ఎప్పుడు చెల్లించారు? బకాయి ఎంత ఉన్నారు? చెల్లించకుంటే డిస్కక్షన్‌పై హెచ్చరికలను సంక్షిప్త సందేశాల రూపంలో అందిస్తారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.