close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మేడారం

అందరి సంక్షేమానికి ఐక్యంగా కృషి చేయాలి

రెడ్డి వనసమారాధనలో నేతల పిలుపు

ప్రసంగిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే

కందాళ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు,

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: పేద రెడ్డి కుటుంబాల సంక్షేమం, విద్యాభివృద్ధే తమ లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. అందరి సంక్షేమానికి ఐక్యంగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో వనసమారాధన కార్యక్రమం ఆదివారం వేడుకగా నిర్వహించారు. నగర శివారు చెరుకూరి వారి మామిడి తోటలో జరిగిన ఈ వేడుకలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. రెడ్డికులస్థులంతా ఐక్యంగా కుటుంబాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. విద్యతో కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, పేదలు అభివృద్ధి చెందేలా విద్యను ప్రోత్సహించాలన్నారు. సంఘం ఏర్పాటు చేసిన దివంగత వైద్యులు డా.జయచంద్రారెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అమరుల జ్ఞాపకార్థం వచ్చే ఏడాది నుంచి వివిధ రంగాల్లో ప్రతిభ కలిగిన వారికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మందడపు రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రెడ్డి కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించారు. సభలో రెడ్డి వివాహ పరిచయ వేదిక కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, గ్రేట్‌ చారిటబుల్‌ ట్రస్టు ఛైర్మన్‌ డా.కె.సత్యనారాయణరెడ్డి, సంఘం గౌరవ అధ్యక్షుడు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మాజీ అధ్యక్షుడు రామసహాయం నరేశ్‌రెడ్డి, సంఘప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.