close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మేడారం

ఇల్లెందును అభివృద్ధి చేస్తా..

మంత్రి పువ్వాడ అజయ్‌

ఆర్టీసీ బస్టాండ్‌ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌.

చిత్రంలో ఎంపీ కవిత, జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ, దిండిగల రాజేందర్‌ తదితరులు

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: ఇల్లెందుపై తనకు చిన్ననాటి నుంచి ఎంతో మక్కువ ఉందని, దత్తత తీసుకునైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద డీఎంఎఫ్‌ నిధుల(రూ.41లక్షలు)తో నిర్మించనున్న ప్రహరీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, మల్టీ కమ్యూనిటీ సెంటర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇల్లెందు పురపాలకాన్ని తీర్చిదిద్దేందుకు మాటిస్తున్నాననీ, పట్టణంలోని ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అభివృద్ధి చేసే పార్టీలనే ప్రజలు ఆదరించాలన్నారు. వచ్చే పురపాలక ఎన్నికల్లో తెరాసకి అఖండ విజయాన్ని చేకూర్చి ఇల్లెందును మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు పట్టణంలో రూ.120 కోట్లతో అభివృద్ధి జరగడం హర్షించదగిన విషయమన్నారు. ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ నాయకత్వంలో పట్టణాన్ని సుందరీకరిస్తామన్నారు. ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ మాలోత్‌ కవిత, జడ్పీ అధ్యక్షుడు కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయాభివృద్ధి ఛైర్మన్‌ దిండిగల రాజేందర్‌, జడ్పీటీసీ వాంకుడోత్‌ ఉమాదేవి, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, నాయకులు మాధవరావు, వెంకట్‌గౌడ్‌, వెంకటేశ్వర్లు, సుధీర్‌తోత్లా, శ్రీను, వెంకటేశ్వర్లు, రవి, రేణుక తదితరులు పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ కవిత

బస్‌డిపో ఏర్పాటు చేస్తా

ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య బస్‌డిపో ఏర్పాటు చేయాలని సమావేశంలో మంత్రిని కోరారు. స్పందించిన పువ్వాడ ఇల్లెందు ప్రజల చిరకాల కోరికైన బస్‌డిపోను కచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. తక్షణమే ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని, వారు ఇల్లెందుకు వచ్చి పూర్తి వివరాలు సేకరిస్తారన్నారు. కనీసం మినీ డిపో అయినా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

అభివృద్ధి పనులకు ఎంపీ శంకుస్థాపన

పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.కోటితో నిర్మించనున్న అభివృద్ధి పనులకు, రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను, 22వ వార్డు నుంచి రాందేవ్‌బాబా ఆలయం వరకు రూ.60 లక్షలతో బుగ్గవాగుపై వంతెన నిర్మాణానికి ఎంపీ కవిత శంకుస్థాపన చేశారు. రూ.కోటితో నిర్మించిన ఆశ్రమ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, మెరుగైన విద్యాబోధన చేయాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.