close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

ఉన్నత ఆశయాలతో ముందుకు సాగితే విజయం తథ్యం

విద్య, వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ సభలో జహీర్‌ అహ్మద్‌


తెలుగుదనం ఉట్టిపడేలా బుడతల భువన విజయం
చర్ల, న్యూస్‌టుడే: ఉన్నత ఆశయాలతో ముందుకు సాగితే విద్యార్థులకు విజయం తథ్యమని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి జహీర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. రాహుల్‌ విద్యాలయం ఆధ్వర్యంలో చర్లలోని నందీశ్వరుడు కళా భవన్లో ఏర్పాటు చేసిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం ప్రారంభించారు. పాఠశాల ప్రధానాచార్యుడు వర్మరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో భారత్‌ దూసుకెళ్తున్నా ‘దిశ’ లాంటి పరిణామాలు కలిచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు చదువుకన్నా ముందు సంప్రదాయాలు, విలువలను నేర్పించాల్సిన బాధ్యత గురువులపై ఉందని అన్నారు. విద్యార్థుల్లో మేధోశక్తి పెంపొందించడంలో ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ సేవే మార్గంగా ముందుకు సాగుతున్న డాక్టర్‌ డీఎన్‌ కుమార్‌, డాక్టర్‌ ప్రతిభ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం డాక్టర్‌ డీఎన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. భారతీయ విలువలు, మన సంప్రదాయాలను పిల్లలకు నేర్పించడం ద్వారా వారి ఆలోచనా విధానాల్లో మార్పు తేగల్గుతామని అన్నారు. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకునేలా ప్రదర్శనలో తెరను ఏర్పాటు చేశామని అన్నారు. పిల్లల్లో ఉన్న మేధోశక్తి ఈ ప్రదర్శన ద్వారా బయటకు వస్తుందని అన్నారు.

విద్య, వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభిస్తున్న జహీర్‌ అహ్మద్‌ చిత్రంలో డీఎన్‌ కుమార్‌ తదితరులు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

వైజ్ఞానిక ప్రదర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. బుడతలు వేసిన గణనాయకాయ శాస్త్రీయ నృత్యం ముగ్ధులను చేసింది. శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు, శ్రీకృష్ణదేవరాయల వేషధారణలతో చిన్నారులు సాగించిన భువన విజయం ఎంతగానో ఆకట్టుకుంది. డాక్టర్‌ ప్రతిభ, ఎస్బీఐ చీఫ్‌ మేనేజర్‌ నానుమాద్రి కృష్ణార్జునరావు, ఈడీ టీవీపీసీ శాస్త్రి, విద్యావేత్త సీవీకే రావు, నాగభూషణం, గొట్టిపాటి శ్రీనివాసరావు, ఎస్కే షాజహాన్‌, చింతూరి వెంకట్రావు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మైనేని పద్మజ, చంద్రకళ, జ్యోతి, అమల, రవికుమార్‌, ఇన్‌ఛార్జి ప్రధానాచార్యుడు శెట్టి ప్రసాద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.