close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

‘అంగన్‌వాడీ కేంద్రాలను మూసేస్తే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు’

కొత్తగూడెం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మూడు వేల అంగన్‌వాడీ కేంద్రాలను మూసి వేసి 6 వేల మంది ఉద్యోగాలను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఇదే జరిగితే ఆందోళనలు చేపడతామని ‘అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ (ఏఐటీయూసీ అనుబంధం)’ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్‌ హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాల మూసివేత ఆలోచనను విరమించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు. అంతకు ముందు పట్టణంలో ప్రదర్శన చేపట్టి ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. నరాటి ప్రసాద్‌, సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి జె.సీతామహాలక్ష్మీ మాట్లాడుతూ.. సర్వేలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు అంగన్‌వాడీల సేవలను విరివిగా ఉపయోగించుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని మూసేసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.18 వేలు వేతనమివ్వాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, పదవీ విరమణ చేసిన సమయంలో వారికి రూ.5 లక్షలు అందించడంతో పాటు నెలకు రూ.5 వేలు పింఛను అందజేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సంయుక్త కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు కంచర్ల జమలయ్య, వేల్పుల మల్లికార్జున్‌, పోగుల కోటేశ్వరరావు, జిల్లా నాయకులు గోనె మణి, ఇందిర, విజయ, సునిత, అరుణ, మాధవి, వసంత, రూప, ప్రమీల, కనకమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.