close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

నేడు దిగువ సీలేరులో పెన్షన్‌ అదాలత్‌

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా దిగువ సీలేరు (మోతుగూడెం) హైడల్‌ ప్రాజెక్టు కార్యాలయంలో మంగళవారం ‘నిధి ఆప్‌కే నికట్‌’ పేరుతో పెన్షన్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు ఖమ్మంలోని అసిస్టెంట్‌ కమిషనర్‌ మాధవ్‌ శంకర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని భవిష్య నిధి (పీఎఫ్‌) సభ్యులు, పెన్షనర్లు, సంస్థల యాజమాన్యం భవిష్య నిధి.. సమస్యల పరిష్కారానికి ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగులు, సంస్థల యాజమాన్యాలు సమస్యల పరిష్కారం కోసం ro.warangal@epfindia.gov.in చిరునామాకు మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పెన్షనర్లు, సంస్థల యాజమాన్యాల ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.