close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

భారీ వృక్షానికి పునరుజ్జీవం


వృక్షానికి పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని మార్వాడీ బజార్‌లో ఓ వ్యాపారి ఇంటి ముందు సుమారు 150 సంవత్సరాల వయస్సు కలిగిన రావి వృక్షం ఉంది. ఆయన కుటుంబసభ్యులు ఆ వృక్షానికి ప్రతి రోజు పూజలు నిర్వహిస్తారు. అయితే ఇటీవల రహదారి విస్తరణలో భాగంగా వృక్షాన్ని తొలగించాల్సి వచ్చింది. తొలగించొద్దంటూ ఆ ఇంటి యజమాని పురపాలక అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను వేడుకున్నారు. వారి కోరిక మేరకు ఎమ్మెల్యే చొరవ తీసుకొని చెట్టును తొలగించి పట్టణానికి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న సేవాలాల్‌ మందిరం వద్ద నాటాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం వేళ్లతో సహా ఆ వృక్షాన్ని తొలగించి భారీ లారీలో సేవాలాల్‌ మందిరం ప్రాంతానికి తరలించారు. అక్కడ చెట్టును నాటి ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు జిల్లా సంయుక్త కలెక్టర్‌ డేవిడ్‌ పర్యవేక్షణలో ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు పూర్తయింది.

వృక్షాన్ని లారీలో తీసుకెళుతున్న దృశ్యం

సేవాలాల్‌ మందిరం ప్రాంతంలో నాటుతున్న దృశ్యం

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.