close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

చలిగింత

జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, చిన్నారులు

న్యూస్‌టుడే, రాజోలి

శీతాకాల ప్రభావంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో ప్రజలను చలి వణికిస్తోంది. సాయంత్రం ఆరు గంటలకే చలి ప్రారంభం అవుతోంది. ఉదయం ఏడు గంటల వరకు ప్రభావం ఉంటోంది. చలిగాలులు, కురుస్తున్న చినుకుల కారణంగా ఉదయం వేళ వాతావరణం శీతల ప్రాంతాలను తలపించేలా పొగమంచు కప్పేస్తోంది. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా రోగులు చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటుండటంతో రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వారంలో కనిష్ఠం 14.1 డిగ్రీల సెల్సియస్‌ : జోగులాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గి, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. డిసెంబర్‌ ప్రారంభానికి

ముందు వరకు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉండగా, ఒకటో తేదీ నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చాయి. గద్వాల, అయిజ, మానవపాడు, ధరూర్‌ మండలాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. డిసెంబర్‌ రెండో తేదీన జిల్లాలో 21 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈ నెల 9వ తేదీ (సోమవారం)న ఈ సీజన్‌లోనే అత్యల్పంగా మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో 14.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఇప్పటికే ప్రజలు స్వెటర్లను కొనుగోలు చేస్తుండగా, గ్రామాల్లో ప్రజలు చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు. చలితీవ్రత ఎక్కువగా ఉంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి..

ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, మహిళలు, వ్యాధిబాధితులు అప్రమత్తంగా ఉండాలి. చలివేళ ముఖానికి అచ్ఛాదన తప్పనిసరి. వాహనదారులు కూడా శిరస్త్రాణం ధరించాలి. ఆరోగ్య జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

- డా.నవీన్‌ క్రాంతికుమార్‌, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు, గద్వాల ప్రభుత్వాసుపత్రి

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.