close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

ఉల్లిక్కిపాటు

చుక్కలు చూపుతున్న ధరలు

ఈనాడు, వరంగల్‌, పరిమళకాలనీ, న్యూస్‌టుడే

రావా.. దిగి రావా..

ఎందుకు ఎక్కుతున్నావ్‌ కొండ..

మాకు అందకుండా..!

ఎందుకు పోతున్నావ్‌ నింగికి..

మాకు కనిపించకుండా..!

ఎందుకు వెళ్తున్నావ్‌ పైౖకి..

మాకు చిక్కకుండా..!

ఎందుకు పెరుగుతున్నావ్‌ అంతగా..

మాకు దొరకకుండా..!

ఎందుకు ఏడిపిస్తున్నావ్‌ అమ్మను..

నిన్ను కోయకుండా..!

మాటిస్తావా....

దిగొస్తానని!

ఒట్టేస్తావా..

కదిలొస్తానని!

- ఈనాడు, వరంగల్‌ డెస్క్‌

ఇంట్లో చేసే వంటల్లో ఉల్లి ఊసే లేకుండా పోతోంది.. రెస్టారెంట్లలోనూ ఇదే పరిస్థితి.. ఎవరైనా అడిగితే ఆ ఒక్కటీ అడక్కు అంటూ ఆమడ దూరం పారిపోతున్నారు.. వ్యాపారులకూ ఈ పరిణామాలు శరాఘాతంగా మారాయి.. ధరలు పెంచుతూ రోజూ బోర్డు మారుస్తున్నా, కొనేవారే కనిపించడం లేదు.. వచ్చిన స్టాక్‌ అలాగే మిగిలిపోతోంది... ప్రజాప్రతినిధులూ ఈ దెబ్బతో అతలాకుతలమవుతున్నారు... మీరేం చేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తే చెప్పడానికి జవాబు లేక ఆగమాగం అవుతున్నారు.. ఇలా ఉల్లిగడ్డ ఉమ్మడి వరంగల్‌లోని అన్ని వర్గాల వారినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే లొల్లి..

వాడటం ఆపేశాం..

- రుక్మిణి, గృహిణి, హన్మకొండ

మా ఇంట్లో ఆరుగురం ఉన్నాం. ధరలు పెరిగినప్పటి నుంచి ఉల్లి వాడటం మానేశాం. మాకు వారంలో దాదాపు 2 కిలోలు అవసరం. వారానికి సరిపడా కొనాలంటే దాదాపుగా రూ.200 వరకు అవుతుంది. ఇంత ధర పెట్టి కొనలేక మిన్నకుంటున్నాం. ధరలు తగ్గాకే వాడతాం.

ఇదీ పరిస్థితి

ఉమ్మడి జిల్లాకు వరంగల్‌ మార్కెట్‌ నుంచి ఉల్లిగడ్డ రవాణా అవుతుంది. గతంలో బీటుబజార్లోని విపణికి రోజుకు 100 టన్నుల సరకు వచ్చేది. ఇప్పుడు ధరలు ఆకాశాన్నంటడంతో రోజుకు కేవలం 15 టన్నులే వస్తోంది.

మహారాష్ట్రలోని షోలాపూర్‌, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, గుజరాత్‌లోని మాహువా మార్కెట్ల నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది.

టోకుధరల బజారులో కిలో రూ. 80 ఉన్నా.. చిల్లర వర్తకులు కుమ్మక్కై రూ. 120 నుంచి 130 విక్రయిస్తున్నారు.

మరో వారం పదిరోజుల్లో ధరలు తగ్గవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.

కొమ్మాల తదితర ప్రాంతాల్లో మన రైతులు ఉల్లిని పండిస్తున్నారు. ఇది చేతికొస్తే ధర కిలో రూ. 50 లోపు దిగివస్తుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.