close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

మేడారం

ఇక ఉల్లికాడకే..

పోషకాలు, విటమిన్లు, రుచి సమానమే

ప్రత్యామ్నాయాలపై ప్రజల ఆసక్తి

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

ల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కూరలకు ప్రియమే అవుతోంది. సామాన్యుడు అటువైపు చూడలేని పరిస్థితి. ఈ సమయంలో ఉల్లికి ప్రత్యామ్నాయంగా కాడలు మేలని ఆలోచనలో ప్రజలు ఉన్నారు. వాటి కొనుగోలుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇంటికి సరిపోయే విధంగా పెరటి తోటల్లోనూ పెంచడంపై దృష్టిసారిస్తున్నారు.

ఉభయ తారకం

ఖమ్మం రైతుబజారుకు నిత్యం మరిపెడ బంగ్లా నుంచి ఉల్లికాడలు తెచ్చి రైతులు విక్రయిస్తున్నారు. రోజూ 10నుంచి 12 బస్తాలు వస్తుంది. అదే విధంగా ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం, చింతకాని, రఘునాథపాలెం, కొణిజర్ల మండలాల నుంచి కూడా కొంతమేర వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు, సుజాతనగర్‌, అన్నపురెడ్డిపల్లి, భద్రాచలం, చర్ల, పాల్వంచ తదితర మండలాల నుంచి ఆ జిల్లాలోని రైతుబజార్లకు తెచ్చి రైతులు విక్రయిస్తున్నారు. ఇప్పుడు విపణిలో ఉన్న ఉల్లిగడ్డల పరిమాణం చాలా తక్కువగా ఉంది. కాడల చివర ఉన్నంత కూడా లేవు. దీంతో ఉల్లికాడలు కొనుగోలు చేయటం ద్వారా వాటి చివర ఉన్నగడ్డలు కూడా ఉపయోగపడుతున్నాయి. రెండు విధాలుగా ప్రయోజనం జరుగుతోంది. గతలో రూ.10లకు 3నుంచి 4 ఉల్లి కాడల కట్టలు ఇచ్చారు. ఇప్పుడు ధరలు పెరగటంతో కాడలకు ధరలు పెంచారు. రూ.20లకు 4 కట్టలు ఇస్తున్నారు.

* ఉల్లి ఎకరానికి 140 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది.

* రెండు జిల్లాల్లో కలిపి ఉల్లి 150 నుంచి 200 ఎకరాల్లో మాత్రమే సాగవుతోంది.

* జిల్లా అవసరాలకు ఉల్లి సరిపడాలంటే కనీసం 700 నుంచి 800 ఎకరాల్లో సాగు చేయాలి.

మరో ప్రత్యామ్నాయం క్యాబేజి

నగర, పట్టణ ప్రాంతాల్లో సాయంత్రం అయ్యిందంటే యువత, చిన్న పిల్లలకు నూడుల్స్‌ కోసం ఎగబడుతుంటారు. వీటి తయారీలో ఉల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇప్పుడు అవి మరింత ప్రియమైన నేపథ్యంలో వాటికి బదులు క్యాబేజీని ఉపయోగిస్తున్నారు.

ఈ లెక్కన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మొత్తం 11 లక్షల మందిలో 7లక్షల మందికి ఉల్లి ఎక్కువ ఉపయోగిస్తారని అంచనా. ఈవిధంగా రెండు జిల్లాలకు కలిపి సుమారు 50వేల క్వింటాళ్లు అవసరం ఉంటుంది.

అన్నీ సమానమే: జినుగు మరియన్న, ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి, భద్రాద్రి జిల్లా

ఉల్లి కాడలు ఎంతో ఆరోగ్యకరం. వీటిని తింటే ఎంతో మంచిది. ఉల్లి గడ్డల్లో ఉన్న అన్ని రకాల పోషకాలు వాటిలో ఉంటాయి. విటమిన్లు, ఖనిజలవణాలు, రుచి ఉల్లి గడ్డల్లో ఉన్న మాదిరిగానే ఉంటుంది. అందుకే ప్రత్యామ్నాయంగా కాడలు ఉపయోగించటం మంచిది. ఇప్పుడే ఉల్లి సాగుపై అవగాహన కల్పిస్తున్నాం. వివిధ రకాల పంటల సాగుతో పాటు ప్రతి పొలంలో ప్రత్యేకంగా రెండు మూడు వరుసలు ఉల్లి సాగు చేస్తున్నారు. ఇవి ఇంటి అవసరాలను తీర్చే అవకాశం ఉంటుంది. ఇలా ధరలు పెరిగినప్పుడు మార్కెట్‌పై ఆధారపడకుండా ఇంట్లోనే అందుబాటులో ఉంటుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.