close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

మేడారం

సరిహద్దున మమకారం

మద్యం విక్రయాలపై ఆంధ్రా ప్రభావం

వైరా, న్యూస్‌టుడే

ద్యం అమ్మకాలకు సహజంగానే కొదవ ఉండదు. విక్రయదారులు చాలామంది ఉమ్మడి జిల్లాలో ఊరూరా పదుల సంఖ్యలో బెల్టు దుకాణాలతో అమ్మకాలను పరుగులు పెట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం నియంత్రణ, ధరలు పెరగడంతో ఆ ప్రభావం కూడా మనపై స్పష్టంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాకు ఆనుకొని ఉన్న ఏపీలోని పలు ప్రాంతాల వారు మద్యాన్ని ఎక్కువగా ఇక్కడ నుంచే కొనుగోలు చేస్తున్నారు. దీంతో అమ్మకాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి.

తెలంగాణలో నవంబరు ఒకటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 169 మద్యం దుకాణాలు, 47 బార్లు, మూడు క్లబ్బులున్నాయి. వీటి పరిధిలో నెలకు సరాసరి రూ.100 కోట్ల నుంచి రూ.110 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. నవంబరు నెలలో మాత్రం ఉమ్మడి జిల్లాలో ఏకంగా రూ.138 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ ధర కేవలం డిపో నుంచి వ్యాపారులకు విక్రయించిన ధర మాత్రమే. ఎమ్మార్పీ ప్రకారం లెక్కిస్తే విలువ రూ.180 కోట్ల పైమాటే. ఈ నెలలో 2,98,636 కేసుల మద్యం, 1,27,674 బీరు కేసుల విక్రయాలు జరిగాయి.

ఆంధ్రా ప్రభావం..

మద్యం నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిలో భాగంగా అనేక చర్యలకుపక్రమించింది. మద్యం టెండర్లను రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దీనికిగాను మద్యం ధరలను అక్కడ పెంచేశారు. తెలంగాణలో రూ.145 ధర ఉన్న క్వార్టర్‌ సీసీ ఏపీలో రూ.170 వరకు పెంచారు. ఇక బీరు సీసా ధరను రూ.20 నుంచి రూ.30 వరకు పెంచారు. అత్యధికులు తాగే అతి తక్కువ బ్రాండ్‌ ఉన్న ధరను క్వార్టర్‌కు రూ.20 పెంచారు. బార్లలో ధరల పెంపు అమాంతం చేశారు. ఇలాంటి చర్యలతో ఏపీలో అవసరమైన మద్యం బ్రాండ్లు లభించకపోవడం, ధరలు పెంచడం, బెల్టుషాపులు లేకుండా చేయడం వంటి చర్యలతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు ఆనుకుని ఉన్న మండలాల వారు ఇక్కడ నుంచి మద్యం కొనుగోలు చేస్తున్నారు.

మనకేం నష్టం లేదండోయ్‌..

ప్రభుత్వ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకాలే. ఎంత ఎక్కువగా అమ్మిస్తే అంత గొప్ప అన్న చందంగా మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. ఆబ్కారీ అధికారులు సైతం తమకు వచ్చే ఇలాంటి ఆదేశాలను అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం వారు ఇక్కడ నుంచి మద్యం కొనుగోలు చేయడం, ఇక్కడ నుంచి తీసుకెళ్లినా మనకేం నష్టం లేదంటున్నారు ఆబ్కారీ అధికారులు. ఎందుకంటే మన దుకాణాల్లో విక్రయించే సరుకంతా పన్ను విధించిందే. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఇంకా ఆదాయ వనరులు పెరుగుతున్నట్లుగానే ఆబ్కారీ శాఖ భావిస్తుంది.

నెలలో సాధారణ విక్రయాలు: రూ. 100

కోట్లు నవంబరులో విక్రయాలు: రూ. 130 కోట్లు

సరిహద్దు ప్రాంతాలిలా..

వైరా: కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం (నెమలి తదితర ప్రాంతాలు)

బోనకల్లు: వత్సవాయి  తల్లాడ, కల్లూరు, పెనుబల్లి: కృష్ణా జిల్లా తిరువూరు

వేంసూరు: విసన్నపేట, చనుబండ

అశ్వారావుపేట: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జీలుగుమల్లి, బుట్టాయిగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, చింతలపూడి.

భద్రాచలం: తూర్పు గోదావరికి చెందిన ఐదారు మండలాలు

* సత్తుపల్లి సైతం ఆంధ్రా ప్రాంతానికి దగ్గరగా ఉంది.

* మధిర, ఎర్రుపాలెం మండలాలకు ఆంధ్రా ప్రాంతాలన్నీ సరిహద్దుగానే ఉంటాయి.

ఏపీలో పలు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కానీ పనులపై వచ్చిన సమయంలో ఇక్కడ నుంచి మద్యం తీసుకెళ్తూ అక్కడ రహస్యంగా విక్రయిస్తున్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.