close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

ముంగిట్లోనే.. తాజా తాజాగా!

గృహ సముదాయాల చెంతకే కూరగాయలు
నయా సాంకేతికతతో ఫ్రెష్‌ క్యూర ట్రక్‌
సేంద్రియ ఆహారానికి ప్రాధాన్యం..
పలు ప్రాంతాల్లో సేవలందిస్తున్న గ్రీన్‌ స్టేషన్‌
శివారు ప్రాంతాల నుంచి నగరానికి దిగుమతి
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

మార్కెట్లో లభించే కూరగాయలు తాజావేనా..? అవి ఎంతకాలం నిల్వ ఉంటాయి..! తాజా కూరగాయలే మన అపార్ట్‌మెంట్‌ వద్దకు వస్తే ఎలా ఉంటుంది.. ఈ కోణంలోనే ఆలోచించి.. మనం ఉన్న చోటుకే వచ్చి తాజా కూరగాయలు అందించే ప్రయత్నం చేస్తున్నాయి పలు స్టార్టప్‌ సంస్థలు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలను నగర శివారు ప్రాంతాల నుంచి తీసుకువచ్చి సాంకేతిక పద్ధతుల్లో భద్రపరిచి నగరంలోని పలు ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తున్నారు. గృహ సముదాయాల్లో ఉండే వారు.. ప్రతిదానికి కిందకి పైకి వెళ్లకుండా.. అనుకున్న సమయంలో అనుకున్న సరకులు అందించాలన్న సంకల్పంతో నగరంలో ఈ తరహా స్టార్టప్‌ సంస్థలు సేవలు అందిస్తున్నాయి.

ఫ్రెష్‌ క్యూర ట్రక్‌...
నగరంలో తొమ్మిది ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్‌, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఫ్రెష్‌క్యూర మార్కెట్‌ను విస్తరించింది. శివార ప్రాంతాల్లో కూరగాయలు పండించే రైతుల నుంచి నేరుగా కూరగాయలను సేకరిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి మనీష్‌కుమార్‌ తెలిపారు. కూరగాయలను నిల్వ చేయడానికి ఖాజాగూడలోని కోల్డ్‌ స్టోరేజ్‌ గోడౌన్‌ను వీరు వినియోగిస్తున్నారు. కూరగాయలతో పాటు సేంద్రియ పద్ధతుల్లో పండించిన పండ్లను కూడా వినియోగదారులకు అందిస్తున్నారు. వంటిమామిడి, అజీజ్‌నగర్‌, వికారాబాద్‌, జహీరాబాద్‌, అంకాపూర్‌ తదితర ప్రాంతాల్లోని రైతులతో కలిసి వీరు పనిచేస్తున్నారు. వారంలో మూడు సార్లు ఇక్కడి నుంచి నగరానికి కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. హైడ్రోఫోనిక్స్‌ పద్ధతుల్లో పండించిన కూరగాయలు ఇందులో ఉంటాయి. బ్రకోలీ, జుకినీస్‌ వంటి వాటిని సేంద్రియ పద్ధతుల్లో చేవెళ్ల వద్ద కొందరు రైతులు పెంచుతున్నారు. ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయం చేస్తున్నవారు చాలా మంది నగర శివారు ప్రాంతాల్లో ఉన్నారు. వీరికి మార్కెట్‌ కల్పించడానికి ప్రచారం చేసే బాధ్యతలను ఫ్రెష్‌క్యూర తీసుకుంది.

గ్రీన్‌ స్టేషన్‌..
ఫ్రెష్‌క్యూర తరహాలోనే గ్రీన్‌ స్టేషన్‌ స్టార్టప్‌ సంస్థ కూడా తాజా కూరగాయలను అపార్ట్‌మెంట్‌వాసులు, గేటెడ్‌ కమ్యూనిటీవాసులకు అందిస్తోంది. సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలను రైతుల వద్ద కొనుగోలు చేసి నగరంలో అమ్మకాలు జరుపుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 5నుంచి రాత్రి 9.30గంటల వరకు ఆపార్ట్‌మెంట్ల వద్దకు వస్తోంది. నానక్‌రామ్‌గూడ, కోకాపేట్‌, మదీనాగూడ, పబ్లిక్‌గార్డెన్‌, బాచుపల్లి, సనత్‌నగర్‌, కేబీఆర్‌ పార్కు, బేగంపేట్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఈ ట్రక్‌ ఎక్కువ కనిపిస్తుంది.

నిల్వకు సాంకేతిక పద్ధతి
-మనీష్‌ శ్రీనివాసన్‌, ఫ్రెష్‌క్యూర
సేంద్రియం సాగువి అని తెలిసేలా విద్యావంతులైన రైతుల సర్టిఫికేషన్‌ను అందరికీ కనిపించేలా మా ట్రక్‌లో ఏర్పాటు చేస్తాము. పునరుద్ధరించే ఇంధనం వినియోగంతో మా ట్రక్‌ను నిర్వహిస్తున్నాము. యూటెటిక్‌ వ్యవస్థ ద్వారా ఇందులోనే కూరగాయలను నిల్వ చేస్తున్నాము. విద్యుత్‌ను బ్యాకప్‌ చేసుకోవడానికి ట్రక్‌కు సోలార్‌ ప్యానెళ్లను అమర్చాము. పర్యావరణహితంగా ఉండాలనే ఇలా ఎంచుకున్నాము.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.