close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

కష్టపడితేనే ఇష్టమైన జీవితం

అదనపు డీసీపీ ఉషావిశ్వనాథ్‌

డ్రాలో బహుమతి పొందిన విద్యార్థినులతో ఐసీఎఫ్‌ఏఐ ప్రతినిధులు
(శ్రీకాంత్‌, వరప్రసాద్‌, దిలిప్‌శర్మ, శిరీష, డీవీఎన్‌ మూర్తి)

నిజామాబాద్‌ విద్యావిభాగం, సుభాష్‌నగర్‌ న్యూస్‌టుడే: విద్యార్థులు కష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఇష్టమైన జీవితాన్ని పొందొచ్చని అదనపు డీసీపీ ఉషావిశ్వనాథ్‌ అన్నారు. ‘ఈనాడు- చదువు.. ఐసీఎఫ్‌ఏఐ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ ’ సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్‌ రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో చదువు-కొలువు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథి అదనపు డీసీపీ ఉషావిశ్వనాథ్‌, సంస్థ ప్రతినిధులు శ్రీకాంత్‌ పొత్తూరి, వరప్రసాద్‌, శిరీష, డీవీఎన్‌ మూర్తి, రాజేశ్‌ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అదనపు డీసీపీమాట్లాడుతూ..విద్యార్థులకు ఇంటర్‌ తర్వాత తీసుకొనే నిర్ణయం చాలా కీలకమని పేర్కొన్నారు. కేవలం ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌లే చేయాలని నిర్ణయించుకోకుండా భవిష్యత్తులో రాణించడానికి మరిన్ని కొత్త కోర్సులు ఉన్నాయని గుర్తించాలన్నారు. తమకు నచ్చిన కోర్సులను ఎంచుకొని చిన్నవయస్సులోనే ఉన్నతస్థాయికి చేరుకోవడానికి లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఓటమితో నిరుత్సాహానికి గురికాకుండా శ్రమించి విజయాలను సాధించాలన్నారు. 24ఏళ్లు కష్టపడిన విద్యార్థులు 75ఏళ్లు సంతోషంగా గడపొచ్చని తెలిపారు. ఎవరిపైనా అనుమానం వచ్చినా బాలికలు 100కు డయల్‌ చేస్తే మీకు సహాయం అందుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్‌ ఈనాడు యూనిట్‌ ఇన్‌ఛార్జి ఏఎస్‌ చక్రవర్తి మాట్లాడుతూ..‘ఈనాడు’ వార్తలతో పాటు విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం కోసం ఉపయోగపడే సదస్సులను నిర్వహిస్తుందన్నారు. సదస్సుకు హాజరైన విద్యార్థుల్లో నలుగురిని ఎంపికచేసి బహుమతులను అందించారు.

విజేతలు

మొదటిబహుమతి : జంగం కావ్య (ఎస్‌ఆర్‌ కళాశాల)

రెండో బహుమతి : బి. కావ్య (ఎస్‌ఆర్‌ కళాశాల)

మూడో బహుమతి : ఐశ్వర్య (కాకతీయ కళాశాల)

నాలుగో బహుమతి : సమన్విత (కాకతీయ కళాశాల)

సదస్సుకు హాజరైన విద్యార్థినులు

ఎదగడానికి అనేక అవకాశాలు

- శ్రీకాంత్‌ పోత్తూరి, ఐసీఎఫ్‌ఏఐ నేషనల్‌ బిజినెస్‌ హెడ్‌

ఇంటర్‌ తర్వాత ఏంటీ..? ఏ కోర్సు బాగుంటుందనే వారికి ఐసీఎఫ్‌ఏఐ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ ఆహ్వానం పలుకుతోంది. డిగ్రీలో డ్యూయల్‌ కోర్సులు, ఇతర కోర్సుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించార. గూగుల్‌ సీఈవో సుందర్‌పిచాయిలా ప్రపంచంలోనే అత్యున్నత వేతనాన్ని పొందుతూ..దేశానికి తల్లిదండ్రులు, గురువులకు గర్వంగా నిలవాలి.

చదువుతో పాటు ఉన్నత విలువలను బోధిస్తాం

- వరప్రసాద్‌, ఐసీఎఫ్‌ఏఐ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇంజినీరింగ్‌ విభాగం

ఇంటర్‌ తర్వాత ఏం చేయాలి. కలల ఉద్యోగం ఎలా సాధించాలనే విద్యార్థులకు ఐసీఎఫ్‌ఏఐ మంచి అవకాశాలను కల్పిస్తోంది. కేవలం చదువు ఒక్కటే కొలమానం కాకుండా ఉన్నత విలువలను బోధిస్తుంది. పాఠ్యాంశాలను లోతుగా అర్థమయ్యేలా చెబుతారు. ఇండస్ట్రియల్‌ అనుభవాన్ని కల్పించే విధంగా ప్రయోగాత్మక విద్యను అందిస్తాం. బోధన అంటే మా దృష్టిలో మెదడుకు శిక్షణ ఇవ్వడం. విద్యార్థులు సొంతంగా సమయసారిణిని సిద్ధం చేసుకొంటారు. పీహెచ్‌డీ పూర్తిచేసుకొన్న అధ్యాపకులు మా దగ్గర బోధిస్తారు.


లక్ష్యాన్ని ఏర్పచుకోవాలి

విద్యార్థులు ఇంటర్‌ తర్వాత ఏం చేయాలో ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. సమాజంలో ప్రతి విషయానికి లా అవసరం ఉంటుంది. కేవలం లాయర్‌గానే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. గతంలో మూడేళ్ల కోర్సు మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు వచ్చింది. ఇంటర్‌లో 50శాతం మార్కులు ఉంటే బీబీఏ, బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులకు అర్హులు. ఒక్క సంవత్సరం కోర్సు ఎల్‌ఎల్‌ఎం అందుబాటులో ఉంది. లా విద్యార్థుల్లో భయాన్ని తొలగించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాం. కోర్టు అనుభవాన్ని కళాశాలలోనే కల్పిస్తాం. చదువుతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాం.

- డీవీఎన్‌ మూర్తి, లా స్కూల్‌ అకడమిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌


లాతో అనేక అవకాశాలు

ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌లకు దీటుగా లా చదివిన వారికి అనేక అవకాశాలు ఉన్నాయి.. ఐసీఎఫ్‌ఏఐ డీమ్డ్‌ టుబి యూనివర్సిటీ లా కోర్సులను అమలు చేస్తోంది. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సులను చదవొచ్ఛు ఇంటర్‌ మార్కులు ఆపై కోర్సులోని మెరిట్‌ ఆధారంగా ఉపకార వేతనాలను అందిస్తున్నాం. లా కోర్సును పూర్తి చేసిన వారికి కార్పొరేట్‌, ప్రముఖ కంపెనీలు, బోధన, న్యాయరంగంలో స్థిరపడొచ్ఛు

- దిలిప్‌శర్మ, లా స్కూల్‌ అకడమిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌


ప్రయోగాత్మక విద్యను అందిస్తాం

ఐసీఎఫ్‌ఏఐలో విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందిస్తాం. ఇంజినీరింగ్‌లో కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాం. ఇంజినీరింగ్‌ చేసే విద్యార్థులు పలు కంపెనీల్లో ఆరు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేయాలి. బీఎస్సీలో డ్యూయల్‌ కోర్సులతో తమకు నచ్చిన రంగంలోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నార. 93 ఎకరాల్లో ఉండే డీమ్డ్‌ టుబి యూనివర్సిటీ మినీ ఇండియాలా ఉంటుంది.

- శిరీష, ఐసీఎఫ్‌ఏఐ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇంజినీరింగ్‌ విభాగం

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.