close

బుధవారం, జనవరి 29, 2020

ప్రధానాంశాలు

మేడారం

నవోదయలో ఖాళీ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
వీసీలో పాల్గొన్న జేసీ యాదిరెడ్డి, డీఎస్‌వో, డీఎం, డీసీవో

నిజాంసాగర్‌(పిట్లం), న్యూస్‌టుడే: నిజాంసాగర్‌ జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2020-2021 విద్యా సంవత్సరానికి తొమ్మిదో తరగతిలో ఖాళీ సీట్లకు ఎనిమిదో తరగతి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ శేఖర్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి దశ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినవారికి రెండో దశ పూర్తి చేయటానికి ఈ నెల 15వ తేది గడువు ఇచ్చామన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే www.navodaya.gov.in,www.nvsadmissionclassnine.in లాగిన్‌కావాలని తెలిపారు.


విద్యాశాఖలో ఖాళీల భర్తీకి పరీక్షలు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని వివిధ మండలాల్లో ఎంఐఎస్‌ సమన్వయకర్తలు, ఆపరేటర్లు, సిస్టమ్‌ అనలిస్ట్‌, విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఐఈఆర్‌పీఎస్‌/ఎంఐఎస్‌ సమన్వయకర్త, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఆపరేటర్లు, 23న ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌, సిస్టమ్‌ అనలిస్ట్‌ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.