close

గురువారం, జనవరి 30, 2020

ప్రధానాంశాలు

మేడారం

పడిగాపులకు చెల్లు

టీయాప్‌ ఫోలియో ద్వారా అందుబాటులోకి

ఇంటి నుంచే టైంస్లాట్‌ బుకింగ్‌

న్యూస్‌టుడే, మాక్లూర్‌ గ్రామీణం

ధార్‌లో తప్పులను సరి చేసుకొనేందుకు ఆధార్‌ కేంద్రాల వద్ద రోజూ గంటల తరబడి వరుసలో నిలబడి టోకెన్‌ తీసుకొని ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. ప్రజలు తమ పనులను పక్కనబెట్టి ఆధార్‌లో మార్పుల కోసం కేంద్రాల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాసేవారు. ఈ సమస్యను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘టీ యాప్‌ ఫోలియో’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను మొబైల్‌ ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకొని ఆధార్‌ సవరణ కోసం మీ సేవా కేంద్రాల్లో ఏ సమయంలో స్లాట్‌ ఉందో తెలుసుకోవచ్ఛు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కేంద్రాలు నాలుగున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ కేంద్రాలకు మాత్రమే అవకాశం కల్పించింది. త్వరలో మిగతా వాటికి కూడా అవకాశం కల్పించే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఈ యాప్‌లో 15 రోజుల ముందే వీలైన రోజున స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్ఛు పనిగట్టు కొని కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇందుకోసం రూ.10 కనీస ఛార్జీగా నిర్ణయించారు. ఒక వేళ స్లాట్‌టైం మార్చుకోవాలన్న, స్లాట్‌ రద్దు చేసుకున్నా ఈ ఛార్జీలు వినియోగదారుడి ఖాతాలో జమవుతాయి.

ఎలా చేసుకోవాలంటే?

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కేంద్రాల్లో రోజూ 35 నుంచి 40 మందికి స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి 10 టోకెన్లు అందుబాటులో ఉంచి నిత్యం గంట సమయం కేటాయిస్తారు. స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను దళారులు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఒక్క మొబైల్‌ ఫోన్‌ నుంచి నెలకు 3 సార్లు స్లాట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ఆధార్‌ సవరణ సేవలు అందనున్నాయి.

ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు..

రాష్ట్రవ్యాప్తంగా ఆధార్‌ సవరణ కోసం ప్రభుత్వ కేంద్రాల్లో ఈ యాప్‌ ద్వారా సవరణకు సంబంధించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఇంటి నుంచే స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే విధంగా టీయాప్‌ను తయారు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రాలు తెరుచుకొని ఉంటాయి. ఈ వేళల్లో ప్రజలు సేవలు పొందొచ్ఛు

సమస్యను నివారించేందుకు టీయాప్‌

ప్రజలు.. ముఖ్యంగా మహిళలు చిన్న పిల్లలు ఉన్నవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల వద్ద ఆహారం తీసుకోకుండా పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు తెలంగాణ ఈఎస్‌డీ (ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ) అధికారులు టీయాప్‌ ఫోలియో మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.


మెరుగైన సేవలు అందించేందుకే...

ఈ ఫోలియో యాప్‌ వాడకం చాలా సులువు. దళారులను నమ్మి మోసపోకుండా ఉండేందుకు టీయాప్‌ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంతో సాంకేతికతను వినియోగిస్తోంది. టీయాప్‌ ఫోలియో ద్వారా ఆధార్‌లో తప్పులను సరిచేసుకోవచ్ఛు

- కార్తీక్‌, ఈ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.