close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

భగీరథ స్థిరీకరణ

వంద రోజుల ప్రణాళిక అమలు

సజావుగా నీటి సరఫరాకు చర్యలు

తొలి విడతలో 162 ఆవాసాల్లో పనులు

ఇంటింటికి ‘కుళాయి’ నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకొచ్చింది. క్షేత్రస్థాయిలో పనులు పూర్తి అయ్యాయి. చాలా చోట్ల లోటుపాట్లు కనిపిస్తున్నాయి. వాటిని పరిష్కరించేందుకు భగీరథ స్థిరీకరణ(వంద రోజుల ప్రణాళిక) అమలు చేస్తున్నారు. అధికారులు బృందాలుగా ఏర్పడి పల్లెల్లో పనుల తీరు పరిశీలిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 827 ఆవాసాలకు రక్షిత నీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటి వరకు 798 ఆవాసాల్లో కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఇంటింటికీ కుళాయి నీరు అందుతున్నప్పటికీ సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘భగీరథ స్థిరీకరణ’కు శ్రీకారం చుట్టింది. వంద రోజుల్లో సమస్యలన్నింటినీ క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో అధికారులు పల్లె బాట పట్టారు. తొలి విడతలో 162 ఆవాసాల్లో వందశాతం పనులు చేయాలని ప్రణాళిక రూపొందించగా ఇప్పటి వరకు 21 ఆవాసాల్లో మాత్రమే పూర్తి చేశారు.

పలు అంశాలపై పరిశీలన

మిషన్‌ భగీరథ పథకంలో ఎలాంటి సమస్యలు ఉండొద్దన్న ఉద్దేశంతో వంద రోజుల ప్రణాళిక రూపొందించాం. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నాం.

* కుళాయిలకు సిమెంటు దిమ్మెల నిర్మాణం.

* పాత ట్యాంకులకు మరమ్మతులు.. కొత్తవి వినియోగంలోకి తీసుకురావడం.. వాటి చుట్టూ నీటి నిల్వ లేకుండా చేయడం.

* వాల్వ్‌లు లీకేజీలు కాకుండా చూడటం.

* చివరి కుళాయి వరకు నీటి మార్గం సుగమం చేయడం.

* కుళాయిలకు కచ్చితంగా ఆన్‌ ఆఫ్‌ వ్యవస్థ ఏర్పాటు.

* పైపులు పైకి కనిపించకుండా భూమిలో పాతడం.

* పైపులైన్‌ గుంతల్లో సీసీ వేయడం.

* వివరాలన్నీ మిషన్‌ భగీరథ వెబ్‌సైట్‌లో నమోదు.

* పల్లెల్లో అవగాహన సదస్సులు

* మిషన్‌ భగీరథ పనుల పర్యవేక్షణకు జిల్లాలో డివిజన్ల వారీగా ప్రత్యేకాధికారులను నియమించారు. సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మిషన్‌ భగీరథ గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

* ప్రైవేటు శుద్ధజల కర్మాగారాల నీటికంటే భగీరథ నీరు మెరుగైందని ప్రచారం చేస్తున్నారు.

* ప్రతి మండలంలో సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నారు.

గడువులోగా పూర్తిచేస్తాం: - లక్ష్మీనారాయణ, ఈఈ ఆర్‌డబ్ల్యూఎస్‌, కామారెడ్డి

భగీరథ స్థిరీకరణలో భాగంగా వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నాం. ఇప్పటికే 21 ఆవాసాల్లో పనులు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నాం. పంచాయతీ తీర్మానాలు తీసుకొంటున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.