close

మంగళవారం, జూన్ 25, 2019

ప్రధానాంశాలు

అడవిలో ఆది దేవుడు

న్యూస్‌టుడే, ధర్మపురి: ధర్మపురి సమీపంలోని అక్కపెల్లి శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి ఎడ్లబండ్లు, ఇతర వాహనాల్లో అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి దాదాపు 2 కి.మీ.ల దూరంలోని ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన ప్రాంతం. శ్రీరామభద్రస్వామి ఇక్కడికి వచ్చి గ్రామస్థులకు తాత్కాలిక బస ఏర్పాటు చేసి సమీపంలో ధర్మపురి గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు, స్వామిజీ ఆజ్ఞ మేరకు అప్పుడే ఇక్కడ స్థిరపడిన బ్రాహ్మణులు ఈ పురాతన శివాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. క్రీ.శ.15వ శతాబ్దంలో ఆలయాన్ని విస్తరించారని, అక్కపెల్లి అనే దాత నిర్మించినందున ఆయన పేరు మీదుగా ప్రసిద్ధి పొందిందని నానుడి. ఈ మందిరానికి సమీపంలో ఒక వాగు, ఆలయ సమీపంలో బావి, ఆ బావిలో ఒక శాసనం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆలయాన్ని అభివృద్ధి చేసి శివలింగం(సాలగ్రామ) రూపంలో ప్రతిష్ఠించారు. చుట్టూ చెట్లతో అలరారుతూ ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయతకు ఆలవాలంగా ఇక్కడి వాతావరణం ఉంటుంది. ఈ నెల 4న ఉదయం శ్రీఅక్కపెల్లి రాజరాజేశ్వరాలయంలో రుద్రాభిషేకాలు, సాయంత్రం 6 గంటలకు గోధూళి సుముహూర్తంలో స్వామివారికి కల్యాణోత్సవం, మరునాడు రథోత్సవం, అన్నపూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.