close

మంగళవారం, సెప్టెంబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిల్లా వ్యాప్తంగా మార్మోగిన రామ నామస్మరణ

ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హర్షాధిరేకాలు


పెంచికల్‌పాడ్‌లో హనుమాన్‌ ఆలయంలో పూజలు చేస్తున్న గ్రామస్థులు

భైంసా పట్టణం, న్యూస్‌టుడే : భైంసాలో శ్రీరామ నామస్మరణ మార్మోగింది. బుధవారం అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి భూమిపూజ నేపథ్యంలో పట్టణంలోని కిసాన్‌గల్లీ, గోకుల్‌నగర్‌, తదితర వీధుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూవాహిని, భాజపా ఆధ్వర్యంలో రాముడికి పూజలు, యాగాలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి హైదరాబాద్‌లోని తన నివాసంలో పూజలు చేశారు.

* భైంసాలో గతంలో కరసేవలో పాల్గొన్న పలువురిని ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూవాహిని, భాజపా నాయకులు ఘనంగా సన్మానించారు.

నిర్మల్‌ పట్టణం: రామమందిర నిర్మాణం కోరుతూ గతంలో అయోధ్యకు వెళ్లొచ్చిన జిల్లా కరసేవకుల బృందానికి నాయకత్వం వహించిన అయ్యన్నగారి భూమయ్యను ఆయన నివాసంలో బుధవారం సత్కరించారు. ఈ సందర్భంగా నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. భూమయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి 245 మంది కరసేవకులు ప్రత్యేక బృందంగా ఏర్పడి రైలులో అయోధ్యకు వెళ్లామన్నారు. 18 రోజుల పాటు వారణాసిలోని జైలులో శిక్షను అనుభవించామని చెప్పారు. రామమందిర నిర్మాణ ఘట్టంలో తొలి అంకమైన భూమిపూజ దేశ ప్రధాని చేతులమీదుగా జరగడం అభినందనీయమన్నారు.


అయ్యన్నగారి భూమయ్యను సన్మానిస్తున్న యువకులు

మామడ: రామాలయ నిర్మాణానికి భూమిపూజ పురస్కరించుకొని మండలంలోని పొన్కల్‌ వేంకటేశ్వర ఆలయంలో శ్రీరామ హోమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు రామచంద్రాచార్యులు, విజయ్‌ ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహించారు. పీఏసీఎస్‌ అధ్యక్షుడు హరీశ్‌కుమార్‌, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌(జి): రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినందుకు గుర్తుగా మండలంలోని రామాలయంలో మొక్కలు నాటి సంతోషం వ్యక్తంచేశారు. సర్పంచి రాంరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మల్లేష్‌ పాల్గొన్నారు.

కుభీరు: రామాలయ నిర్మాణానికి భూమిపూజ సందర్భంగా కుభీరుతో పాటు మండలంలోని పార్డి(కె), సాంవ్లి గ్రామాల్లో యువకులు శ్రీరాముని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు.


హైదరాబాద్‌లోని తన నివాసంలో భర్తతో కలిసి శ్రీరామ పూజ

చేస్తున్న భాజపా జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి

నిర్మల్‌ పట్టణం: రామమందిర నిర్మాణానికి భూమిపూజ నేపథ్యంలో ఆదర్శనగర్‌లోని హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏళ్ల కల నేడు సాకారమైందని, ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొందని ఆలయ కమిటీ అధ్యక్షుడు కామారపు జగదీశ్వర్‌ పేర్కొన్నారు.

కుంటాల: రామాలయ నిర్మాణానికి భూమిపూజ పురస్కరించుకుని ఆయా గ్రామాల్లో భాజపా, హిందూవాహిని నాయకులు, కార్యకర్తలు హనుమాన్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అప్పట్లో అయోధ్య రామ జన్మభూమి ఆందోళనల్లో పాల్గొన్న పెంచికల్‌పాడ్‌, ఓలా, కల్లూరు, కుంటాల గ్రామాలకు చెందిన పలువురిని శాలువాతో సత్కరించారు.

ముథోల్‌: రామమందిర నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా తరోడ గ్రామంలో భాజపా నాయకులు, యువకులు హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ శ్రేణులు రామకృష్ణ, శ్రీకాంత్‌, రతీష్‌ పాల్గొన్నారు.


కుంటాలలో ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

ఖానాపూర్‌ గ్రామీణం: రామమందిర నిర్మాణ భూమిపూజ సందర్భంగా మస్కాపూర్‌ రామాలయంలో, బాదనకుర్తిలోని హనుమాన్‌ ఆలయంతో పాటు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పారాయణాలు నిర్వహించారు.

పెంబి(ఖానాపూర్‌ గ్రామీణం): పెంబి మండల కేంద్రంలో భాజపా మండలాధ్యక్షుడు సదాశివ్‌ ఆధ్వర్యంలో శ్రీరాముని సామూహిక పారాయణం నిర్వహించారు.

కడెం : మున్యాల్‌లో హనుమాన్‌ సేవాసమితి ఆధ్వర్యంలో కాషాయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. రేవోజిపేట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దస్తూరాబాద్‌ మండలంలో భాజపా నాయకుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

నిర్మల్‌ గ్రామీణం: రామాలయ నిర్మాణానికి భూమి పూజ పురస్కరించుకొని పట్టణంలో వాల్మీకినగర్‌లోని రామాలయంలో పూజలు చేశారు.. అర్చకులు రామానుజాచార్యులు, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్‌, అధ్యక్షుడు అడెల్లు, పాల్గొన్నారు.


బాదనకుర్తి హనుమాన్‌ ఆలయం వద్ద భక్తులు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.