close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

10 రోజుల్లో 108 మరణాలు

ఈనాడు, గుంటూరు

జిల్లాలో నాలుగు రోజుల నుంచి కరోనా ఉద్ధృతి కాస్త నెమ్మదించి వెయ్యికి లోపుగానే కేసులు నమోదవుతున్నాయి. ఇది యంత్రాంగానికి ఊరటనిస్తోంది. అయితే సగటున 500కు పైగా కేసులు రావడంతో నిత్యకృత్యంగానే ఉంటోంది. సోమవారం 621 కేసులు వచ్చాయని రాష్ట్ర హెల్త్‌బులిటెన్‌ పేర్కొంది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసులు 22,339కు చేరాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 10 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 7,514 మంది చికిత్స పొందుతుండగా 14,592 మంది కరోనాను జయించి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లారని జిల్లా వైద్యవర్గాలు వెల్లడించాయి. మరణాలు జులైలో 162 సంభవించాయి. ఈ నెలలో 10 రోజుల్లోనే 108 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు నగరంలో వైరస్‌ వ్యాప్తి తగ్గుదలకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. సోమవారం ఉదయం జిల్లా పాలనాధికారి శామ్యూల్‌ ఆనందకుమార్‌ నగరపాలకసంస్థ అధికారులతో సమీక్షించారు. బాధితుల తరలింపులో జాప్యాన్ని నివారించాలని సూచించారు. సోమవారం జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు కొవిడ్‌ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో అగ్నిమాపక పరంగా ఎలాంటి భద్రతా చర్యలు ఉన్నాయో యంత్రాంగం పరిశీలించింది. గుంటూరు అడవితక్కెళ్లపాడులోని టిడ్కో గృహసముదాయం, ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రితో పాటు జిల్లా వ్యాప్తంగా 11 ఆసుపత్రులను పరిశీలించారు.

కరోనా కేసుల పెరుగుతున్నా జనం మామూలుగానే రాకపోకలు సాగిస్తున్నారు. భౌతికదూరం మాట

మరిచిపోయారు. గుంటూరులో ఉదయం 11 గంటలకు నగరంపాలెం సర్కిల్‌లో వాహనాల రద్దీ ఇలా..

జిల్లాలో ఇలా..

అమరావతి 29, అచ్చంపేట 9, బెల్లంకొండ 8, బాపట్ల 16, చేబ్రోలు 1, చిలకలూరిపేట 4, దుగ్గిరాల 1, దుర్గి 2, యడ్లపాడు 2, గురజాల 16, గుంటూరు నగరం 122, గుంటూరు రూరల్‌ 4, కారంపూడి 21, కర్లపాలెం 1, క్రోసూరు 14, మాచర్ల 33, మంగళగిరి 6, మేడికొండూరు 1, ముప్పాళ్ళ 12, నాదెండ్ల 28, నరసరావుపేట 7, నకిరికల్లు 1, పెదకాకాని 5, పెదకూరపాడు 10, ఫిరంగిపురం 1, పిట్టలవానిపాలెం 2, పిడుగురాళ్ల 21, పొన్నూరు 2, ప్రత్తిపాడు 1, రాజుపాలెం 8, సత్తెనపల్లి 153, తాడేపల్లి 11, తాడికొండ 2, తెనాలి 46, తుళ్లూరు 9, వట్టిచెరుకూరు 2, వేమూరు 8, వినుకొండ 2, మొత్తం: 621

రాష్ట్ర హెల్త్‌బులిటెన్‌ ప్రకారం..

కొత్తగా నమోదైన కేసులు 621

24 గంటల్లో మరణాలు 10

ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసులు 22339

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు 7514

కరోనాను జయించినవారు 14592

మొత్తం మృతులు 233

సోమవారం సేకరించిన నమూనాలు 4563

ఫలితాలు వెల్లడించినవి 4107

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.