close

మంగళవారం, సెప్టెంబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్థిక బాధలకు తాళలేక...
ఆభరణాల దుకాణ నిర్వాహకుడు ఆత్మహత్య

వర్కుషాపులో శ్రీనివాసరావు మృతదేహం

విద్యాధరపురం, న్యూస్‌టుడే : ఆర్థిక బాధలకు తాళలేక కృష్ణలంక గౌతమీనగర్‌కు చెందిన వెంగల శ్రీనివాసరావు(40) పాతబస్తీ శివాలయం వీధిలోని సొంత ఆభరణాల వర్కుషాపులో ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... వెంగల శ్రీనివాసరావు స్థానిక శివాలయం వీధిలోని లహరీ కాంప్లెక్సులో ఆర్డరుపై ఆభరణాలు తయారు చేస్తుంటారు. వచ్చిన ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నాడు. రూ.30లక్షలు అప్పులు చేశాడు. లాక్‌డౌన్‌తో ఉపాధిలేక తనవద్ద పనిచేస్తున్న ఇద్దరు యవకులకు జీతాలు ఇవ్వలేక తొలగించాడు. సోమవారం వర్కుషాపు వద్దకు వెళ్లాడు. గతంలో ఇతని వద్ద పనిచేసిన శ్రీను.. యజమానికి ఫోన్‌ చేశాడు. ఎంతకీ ఫోను లిఫ్టు చేయకపోవడంతో ఈ విషయాన్ని శ్రీనివాసరావు భార్య వెంకటేశ్వరమ్మకు తెలియజేశాడు. దీంతో ఆమె.. దుకాణం పక్కన ఉన్న కనకాచారికి విషయం చెప్పింది. అజయ్‌ అనే వ్యక్తి సహకారంతో దుకాణం షట్టరు పైకి ఎత్తి చూడగా శ్రీనివాసరావు విగతజీవిగా కనిపించాడని.. అతడి భార్య వెంకటేశ్వరమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్థిక బాధలకు తాళలేక తన భర్త మద్యంలో విషం ద్రావణం కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావుకు భార్యతో పాటు కుమార్తె విజయదుర్గ ఉన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.