close

సోమవారం, సెప్టెంబర్ 28, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్తగా146 మందికి పాజిటివ్‌

 

జిల్లాలో  10,438కి చేరిన కరోనా కేసులు

6575 మంది డిశ్ఛార్జి.. 3651మందికి చికిత్స

ఈనాడు, విజయవాడ

కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 10,438కి చేరాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9గంటల వరకు కొత్తగా మరో 146 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఇప్పటివరకు 6,575 మంది వైరస్‌ను జయించి ఆరోగ్యవంతులుగా మారారు. మొత్తం 212 మంది మృతి చెందారు. మరో 3,651 మంది ప్రస్తుతం జిల్లాలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు మూడు ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రుల్లో, మరికొందరు ప్రైవేటు ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలు, ఇళ్ల వద్ద ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడం ఇప్పటికీ ప్రహసంనగానే మారుతోంది. జిల్లాలో రోజుకు మూడు వేల మందికి పైగా పరీక్షలు చేయిస్తున్నట్టు అధికారులు చెబుతున్నా.. అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్లాలనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. తాజాగా ఓ గర్భిణికి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స చేయాల్సి ఉండగా.. కరోనా నిర్థరణ పరీక్ష చేయించుకోవాలంటూ వైద్యులు సూచించారు. ఎక్కడికి వెళ్లి చేయించుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి ఆమె కుటుంబసభ్యులకు ఎదురైంది. దీంతో పాటు జ్వరం, శ్వాస అందకపోవడం వంటి తీవ్ర ఇబ్బందులు ఎదురైన వారికి సైతం వెంటనే కరోనా నిర్ధరణ పరీక్ష చేయించుకోవాలంటే ఇక్కట్లు పడుతున్నారు. దీనిపై ప్రస్తుతం జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు ఆసుపత్రులకు అత్యవసర కేసులు వస్తే.. వారిని అక్కడే ఉంచి పరీక్ష చేయించే ఏర్పాటు చేయగలిగితే.. మరిన్ని ప్రాణాలను నిలబెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ అత్యవసర పరీక్షల కోసం ఓ సహాయ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.