close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

మాటతో వినడం లేదని.. లాఠీకి పని..
ఓ యువకుడిని లాఠీతో కొడ్తున్న పోలీసు అధికారి

ఈనాడు, ఖమ్మం:కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కార్యక్రమం అమలులో పోలీసులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ హెచ్చరికలను పెడచెవిన పెడ్తున్నారనే కారణంతో తీసుకుంటున్న చర్యలు విమర్శలపాల్జేస్తున్నాయి. జిల్లాలో ఈ తరహా సంఘటనలో అక్కడక్కడ చోటుచేసుకుంటుండగా.. తాజాగా కూసుమంచి మండలంలోని పోచారంలో ఓ యువకుడిని పోలీసులు లాఠీతో కొట్టిన సంఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడ్తోంది. పోచారంలో చదును చేసిన ఓ ప్రాంతంలో 20మందికి పైగా యువకులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా క్రికెట్‌ ఆడటం, ఇంకా కొందరు గుమిగూడి ఉండటంతో పోలీసులు హెచ్చరించారు. రెండో రోజున కూడా ఇదే కొనసాగడంతో పోలీసులు లాఠీకి పనిచెప్పారు. పోలీసు అధికారి ఓ యువకుని చేతులపై కొడ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం చక్కర్లు కొట్టింది. ఇంతటి తీవ్రమైన చర్యలు సరైనవి కావంటూ కొందరు, ఈ మాత్రం చర్యలు లేకుంటే కరోనా ఇంటింటికి వ్యాపించడం ఖాయమంటూ ఇంకా కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.