close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.. స్వీయనిర్బంధానికి సహకరించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న లాక్‌డౌన్‌ను జిల్లాకలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వైరారోడ్‌లోని మోర్‌మార్కెట్‌, గాంధీచౌక్‌లోని హోల్‌సేల్‌ దుకాణాల్లో ఉన్న నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే ఆయిల్‌, పప్పుధాన్యాలు, పంచదార రవాణా విషయంలో సమస్యలు లేకుండా చూస్తామన్నారు. అత్యసరమైతే తప్ప ప్రజలకు బయటకు రావద్దని కోరారు. నిత్యావసర, ఔషధ దుకాణాల వద్ద నిర్దేశిత దూరాన్ని పాటించాలన్నారు. అన్ని డివిజన్‌ల ప్రజలకు కూరగాయల దుకాణాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీనికి ముందు గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణదారులతో మాట్లాడారు. రెవెన్యూ, పోలీస్‌, వైద్య ఆరోగ్యశాఖ, మీడియా ప్రతినిధులు కుటుంబాలను వదిలి సేవలందిస్తున్నారని, వారికి ప్రజలు సహకరించాలన్నారు.

కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్‌ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసర వస్తువులు తీసుకొనివచ్చే లారీనెంబర్లను ఇస్తే వాటికి అంతరాయం లేకుండా చూస్తామన్నారు. గాంధీనగర్‌లో పలువురు రహదారులపై సంచరించడాన్ని గమనించిన మంత్రి, కలెక్టర్‌ వారికి లాక్‌డౌన్‌ ఉద్దేశాన్ని తెలియజేశారు. కమిషనర్‌ అనురాగ్‌జయంతి, అదనపు కలెక్టర్‌ మధుసూధన్‌రావు, ఆర్‌డీవో రవీంద్రనాథ్‌, తహసీల్దార్‌ శ్రీనివాసరావు ఉన్నారు.

ఖమ్మం నగర వాసుల సౌలభ్యం కోసం డివిజన్ల వారీగా కూరగాయల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తదితరులు శుక్రవారం సందర్శించారు. అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు.

-ఈనాడు, ఖమ్మం

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.