close

గురువారం, జులై 09, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊట అడుగంటి.. కటకట మిన్నంటి

మదనపల్లెలో నీటి సమస్య తీవ్రరూపం

అమ్మచెరువుమిట్ట వద్ద వీధి కుళాయి

వద్ద నీటిని పట్టుకుంటున్న ప్రజలు

మదనపల్లె (పట్టణం): మదనపల్లె పురపాలక సంఘంలో తాగునీటి సమస్య జటిలమైంది. నీటి వనరుల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. 80శాతంపైగా నీటిని ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి ప్రజలకు అధికారులు సరఫరా చేస్తున్నారు. కేవలం తాగునీటి సరఫరాకే నెలకు రూ.1.20 కోట్లు ఖర్చవుతుండడం గమనార్హం. పురపాలక సంఘం పరిధిలోని 35వార్డుల్లో సుమారు 2లక్షల మంది నివాసముంటున్నారు. మొత్తం 262 బోరుబావుల ద్వారా స్థానికులకు నీటిని అందిస్తుండగా.. ప్రస్తుతం అందులో 91 బోరుబావుల్లో మాత్రమే అరకొర నీరు వస్తోంది. 180 చేతిబోర్లు ఉండగా 90వాటిల్లో తక్కువ మోతాదులో నీరు వస్తోంది. మిగతా వాటిలో కొన్నింటిలో నీటి ఊట లేదు. కొన్ని మరమ్మతులకు గురయ్యాయి. పట్టణంలో రోజు తాగునీటి అవసరాల కోసం 12.25 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 8.50ఎంఎల్‌డీ మాత్రమే అందిస్తున్నారు. ఏప్రిల్‌, మే నెలలో పురపాలక సంఘం ఇంజినీరింగ్‌ అధికారులు పట్టణంలోని 46 బోరుబావులను గుర్తించి మరమ్మతులు చేయించారు. ఇందులో 30బోరుబావుల్లో నీళ్లు వచ్చే విధంగా చర్యలు చేపట్టారు. పురపాలిక అధికారులు పట్టణవాసుల తాగునీటి అవసరాల కోసం ఇదివరకు 580ట్యాంకర్ల నీటిని ప్రైవేటుగా కొనుగోలు చేస్తుండగా, ప్రస్తుతం వేసవి తీవ్రరూపం దాల్చడంతో కొనుగోలు 680ట్యాంకర్లకు పెంచారు. ట్యాంకరు నీటిని రూ.570 చొప్పున వెచ్చిస్తున్నారు. రెండు రోజులకొకసారి 18 వార్డులకు, 3రోజులకు11, 4 రోజులకోసారి 6వార్డులకు నీటిని అందిస్తున్నారు.

 

ప్రజల అవసరాలకు ప్రాధాన్యమిస్తున్నాం

ప్రజల తాగునీరు అవసరాలను అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. వేసవి తీవ్రం కావడంతో బోర్లు చాలా వరకు పనిచేయడం లేదు. ప్రైవేటు వ్యక్తుల నుంచి నీటిని కొనుగోలు చేసి ఇబ్బంది కలగకుండా సరఫరా చేయడానికి కృషిచేస్తున్నాం - పి.ఎస్‌.మహేష్‌, డీఈఈ, పురపాలకసంఘం

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.