close

బుధవారం, ఆగస్టు 05, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బిల్లులపై పీటముడి పల్లెవాసులు తడబడి 

●ఏడాదిన్నరగా నిలిచిన గ్రామీణ రోడ్లు

●రాకపోకలకు అవస్థలు

 

ఇది బైరెడ్డిపల్లె నుంచి ధర్మపురి మీదుగా మోట్లపల్లె క్రాస్‌ వరకు వెళ్లే రహదారి. మొత్తం అయిదు కిలోమీటర్ల మేర ఆరు గ్రామాలను కలిపే రోడ్డును రూ.2.26 కోట్లతో నిర్మించాలని గత ప్రభుత్వం భావించింది. 2018లో నిర్మాణ పనులు ప్రారంభించి.. కంకర పరిచారు. ప్రభుత్వం మారడంతో పనులు నిలిపేశారు. దాంతో ద్విచక్ర వాహనదారులు, అత్యవసర వైద్యం కోసం వాహనాల్లో వెళ్లే ప్రజలు అవస్థలు పడుతున్నారు.

●పీలేరు నియోజకవర్గంలో 491 పనులు చేపట్టగా 133 పూర్తయ్యాయి. సుమారు రూ.21 కోట్లతో చేపట్టిన 358 పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

●పలమనేరు నియోజకవర్గంలో 42 గ్రామీణ రహదారులు మంజూరు కాగా.. సుమారు 30కి పైగా పెండింగ్‌లో ఉండిపోయాయి.

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు : మండల కేంద్రాల నుంచి గ్రామాలకు అనుసంధానం చేసి.. పల్లె ప్రజలు త్వరితగతిన గమ్యస్థానానికి చేరడానికి జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామీణ రోడ్లు ఏడాదిన్నరగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో మారుమూల గ్రామాలతోపాటు అధ్వానంగా ఉన్న రహదారుల స్థానంలో నూతనంగా తారురోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఆయా మండలాల నుంచి ప్రతిపాదనలు కోరారు. వాటిని పరిశీలించిన అనంతరం పలు పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. గుత్తేదారులు పనులు దక్కించుకొని.. నిర్మాణాలు ప్రారంభించారు. చాలాచోట్ల గ్రావెల్‌ పరిచి.. కంకర వేశారు. రోడ్ల నిర్మాణం పూర్తయితే సకాలంలో ఆసుపత్రులు, ఇతర ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చని ఆయా గ్రామస్థులు భావించారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో పనులు నిలిచిపోయాయి.

బిల్లులపై సందిగ్ధంతోనే..

ఎన్నికల అనంతరం ఆగిన పనులను కొనసాగించాలని గుత్తేదారులు తలచినా.. బిల్లులు వస్తాయో లేదో అన్న సందిగ్ధంలో పడ్డారు. ప్రధానంగా పీలేరు, గంగాధరనెల్లూరు, పలమనేరు, నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఈ దుస్థితి నెలకొంది. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని మండలాల్లోని గుత్తేదారులు నిర్మాణ పనులు చేపట్టారు. అధికశాతం మంది బిల్లులపై స్పష్టత వచ్చే వరకు వేచి చూద్దామనే ధోరణిని పాటించారు. ఫలితంగా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు గ్రామీణ రహదారుల నిర్మాణం పెండింగ్‌లోనే పడ్డాయి. ఫలితంగా కంకర పరిచిన రోడ్లపైనే గ్రామాల్లోని ప్రజలు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనాలు అదుపు తప్ఫి. చోదకులు గాయపడిన ఘటనలూ ఉన్నాయి.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం

సచివాలయ భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, ఈఏపీ రహదారుల నిర్మాణంతోపాటు నాడు-నేడు కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే గ్రామీణ రహదారులపై దృష్టి సారిస్తాం. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.

- అమరనాథరెడ్డి, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌

ఈ చిత్రంలో కనిపిస్తున్న అసంపూర్తి రహదారి పెనుమూరు మండలం కేశీపల్లి రోడ్డు నుంచి మెట్టూరు వరకు వెళుతుంది. ఒకటిన్నర కిలోమీటరు మేర ఉన్న రోడ్డు పనులు ఏడాదిన్నర క్రితం నిలిచిపోయాయి. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో రూ.8.30 కోట్లతో చేపట్టిన 11 పనులు ఇలా అసంపూర్తిగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు

చంద్రబాబు సవాల్‌కు భయపడిన వైకాపా: నాని

తిరుపతి(నగరం): రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని మార్చడంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని మార్పు జరగలేదని, రాజకీయ దురుద్దేశంతోనే మూడు రాజధానులు తెరపైకి వచ్చాయని విమర్శించారు. సీఎం జగన్‌ రాజధాని విషయంలో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. చిత్తూరు(జిల్లా పంచాయతీ): తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్‌కు వైకాపా భయపడిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీలు రాజసింహులు, గౌనివారి శ్రీనివాసులు అన్నారు.

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.