close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరికి కళ్లెం

● ఐఓసీ సహకారంతో నిఘా

● జీపీఎస్‌ ట్రాకింగ్‌కు అనుమతి

ఏనుగు మెడలో అమర్చిన జీపీఎస్‌ కాలర్‌

పంటలపై ఏనుగుల దాడులు అరికట్టేందుకు అటవీశాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగనుంది.. వాటి కదలికలపై నిఘా వేసి కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది.. ముందుగా అవి ఎక్కడున్నాయో.. ఎటువైపు కదలుతున్నాయో తెలుసుకుని ఆపై వాటిని అడవుల నుంచి పొలాల్లోకి రాకుండా నిరోధించాలనేదే అధికారుల ఆలోచన.. ప్రస్తుతం ఝార్ఖండ్‌, కర్ణాటకలో అమల్లో ఉన్న జీపీఎస్‌ ట్రాకింగ్‌ విధానాన్ని ఇక్కడా వినియోగించుకునేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ విధానం విజయవంతమైతే గజరాజుల ఆగడాలకు కళ్లెం పడినట్లే.

న్యూస్‌టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ): కర్ణాటకలోని హొసూరు, తమిళనాడులోని కృష్ణగిరి అడవుల నుంచి రాష్ట్రంలోకి ముఖ్యంగా జిల్లా సరిహద్దుల్లోకి పెద్దఎత్తున ఏనుగులు ప్రవేశిస్తున్నాయి. గుడిపాల, చిత్తూరు, యాదమరి, బంగారుపాళ్యం, పలమనేరు, కుప్పం, రామకుప్పం, చంద్రగిరి, మామండూరు అటవీ ప్రాంతాల్లో ఇవి గుంపులుగా సంచరిస్తున్నాయి. వీటిని పొలాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు అధికారులు, రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఏటా అన్నదాతకు వాటిల్లుతున్న నష్టం రూ.కోట్లలోనే ఉంటోంది.

ట్రాకింగ్‌కు కేంద్రం సిద్ధం

ఏనుగులకు జీపీఎస్‌ విధానాన్ని అమర్చాలంటే గుంపులో ఒకదానికి మత్తు ఇచ్చి స్పృహ లేకుండా చేసి దాని మెడకు పరికరం కట్టి ప్రత్యేక యాప్‌కు అనుసంధానం చేయాలి. ఆపై దాన్ని గుంపులో కలపాలి. అవి ఎటునుంచి కదులుతున్నాయనేది యాప్‌ ద్వారా సమాచారం అందుతుంది. దీంతో అవి సరిహద్దుల్లోకి రాగానే అప్రమత్తమై సిబ్బందిని పంపి నిలువరించవచ్ఛు ఈ ప్రక్రియకు కేంద్రం అనుమతి తప్పనిసరి. ఇటీవల బదిలీపై వెళ్లిన డీఎఫ్‌వో సునీల్‌కుమార్‌ రెడ్డి గతేడాది డిసెంబరులో జీఈఎస్‌ విధానాన్ని అమర్చేందుకు అవసరమైన నిధుల కోసం యాదమరిలోని ఐవోసీతో చర్చించగా వారు రూ.35 లక్షలు సమకూర్చారు. ఆపై అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆయన బదిలీపై వెళ్లడంతో ప్రస్తుత డీఎఫ్‌వో నరేన్‌థిరన్‌ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. తాజాగా కేంద్రం నుంచి అనుమతి రావడంతో జీపీఎస్‌ అమలుకు రంగం సిద్ధమైంది.

నిపుణులు రాగానే ఏర్పాటు

ఏనుగులకు జీపీఎస్‌ను అమర్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కరోనా తగ్గాక డెహ్రాడూన్‌ నుంచి నిపుణులు రాగానే ఈ ప్రక్రియ ప్రారంభిస్తాం. ఏనుగుల కదలికలను పసిగట్టి అవి జనావాసాలు, పంట పొలాల్లోకి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడతాం. - నరేన్‌థిరన్‌, పశ్చిమ డీఎఫ్‌వో, చిత్తూరు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.